సూర్యాపేట జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య

వ్యక్తి ఆత్మహత్య

పెన్ పహాడ్, సెప్టెంబర్ 06, మనసాక్షి: కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చీదేళ్ల గ్రామములో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గొబ్బి బాబు(40) భార్య భాగ్యమ్మతో 20 సంవత్సరాల క్రితం పెళ్లి జరగగా ఆమెతో గత నాలుగు రోజుల క్రితం వివాదం చోటు చేసుకోగా తన భార్య చివ్వేంల మండలం తిమ్మాపురం గ్రామంలోని ఆమె తల్లితండ్రుల వద్దకు వెళ్లింది. భార్య వదిలి వెళ్లడంతో మనస్థాపం చెందిన బాబు సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స నిమిత్తం పట్టణంలోని రాంమూర్తి ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తీసుకొని వెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడని, మృతుని భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు, మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.