District collector: మన ఇసుక – మన వాహనం ద్వారా ఇసుక రవాణా.. జిల్లా కలెక్టర్..!
District collector: మన ఇసుక – మన వాహనం ద్వారా ఇసుక రవాణా.. జిల్లా కలెక్టర్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
నారాయణపేట జిల్లాలో గుర్తించిన ఇసుక రీచ్ ల నుంచి మన ఇసుక మన వాహనం (ఆన్ లైన్) ద్వారా ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో ఏర్పాటు చేసిన డి.ఎల్.ఎస్.సి( డిస్టిక్ లెవెల్ స్యాoడ్ కమిటీ) సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలో గృహ అవసరాల నిమిత్తం ఇసుక కావాల్సిన వారు మన ఇసుక -మన వాహనం ద్వారా అనుమతులు పొంది ఇసుకను తీసుకోవచ్చని ఆమె తెలిపారు. జిల్లాలో ఆన్ లైన్ ఇసుక రవాణా ను రెండు మూడు రోజులలో ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆమె ఆదేశించారు.
సమావేశంలో మైనింగ్ ఏడి సంజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 7 ఇసుక రీచ్ లు ఉన్నాయని కానీ వాటిలో ప్రస్తుతం మాగనూరు మండలం వర్కూర్ లో మూడు, మక్తల్ మండలం దాసర్ దొడ్డి లో ఒక రీచ్ లో ఇసుక అందుబాటులో ఉందని, ఈ నాలుగు రీచులలో మొత్తం 65,554 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లు భూగర్భ జల వనరుల శాఖ అధికారులు రిపోర్ట్ ఇచ్చారని కలెక్టర్ కు తెలిపారు.
ఇక మిగిలిన కొత్తపల్లి, లింగాల్ చేడ్, నందిగామ, నాగిరెడ్డిపల్లి రీచ్ లలో వర్షాల కారణంగా ఇసుక రవాణా సాధ్యం కాదని ఆయన చెప్పారు. అయితే మైనింగ్, గ్రౌండ్ వాటర్, తహాసిల్దార్లు రీచుల పరిశీలన ఎలా చేశారని, ఇదివరకు జిల్లాలో కొనసాగించిన ఆన్ లైన్ ఇసుక బుకింగ్, అనుమతులు, ఓటిపి,రవాణా, ఒక రీచ్ లో రోజుకు ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించే అవకాశం ఉంటుందని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇదివరకు ఉన్న ఈ ఇసుక విధానాన్ని స్టడీ చేసేందుకు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు. అలాగే ఇతర జిల్లాలలో కొనసాగుతున్న ఆన్ లైన్ ఇసుక రవాణా గురించి తెలుసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
నిబంధనల మేరకు జిల్లాలో ఇసుక రవాణాను కొనసాగించాలన్నారు. పట్టా ల్యాండ్ల లో ఇసుక రవాణాకు సంబంధించి ఆయా శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆమె సూచించారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీవో మధుమోహన్, భూగర్భ జల వనరుల శాఖ అధికారిని రమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ, మిషన్ భగీరథ ఏంట్రా ఈ ఈ రంగారావు, మక్తల్, మాగనూరు తహాసిల్దార్లు సతీష్ కుమార్, సురేష్, కలెక్టరేట్ లోని సంబంధిత సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి
-
Viral Video : అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగిందని బైక్ ఆపాడు.. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్.. (వీడియో వైరల్)
-
Viral Video : అయ్య బాబోయ్.. ఎంత అదృష్టవంతురాలో ఆమె.. (వీడియో)
-
Viral Video : ప్రియుడిని ట్రంకు పెట్టెలో దాచిన ప్రియురాలు.. ఎందుకో, ఎలా దాచిందో చూస్తే షాక్.. (వీడియో)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)









