Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
viralBreaking NewsTOP STORIESజాతీయం

Viral Video : ప్రియుడిని ట్రంకు పెట్టెలో దాచిన ప్రియురాలు.. ఎందుకో, ఎలా దాచిందో చూస్తే షాక్.. (వీడియో)

Viral Video : ప్రియుడిని ట్రంకు పెట్టెలో దాచిన ప్రియురాలు.. ఎందుకో, ఎలా దాచిందో చూస్తే షాక్.. (వీడియో)

మన సాక్షి , వెబ్ డెస్క్:

ఓ ప్రియురాలు తన ప్రియుడిని ట్రంక్ పెట్టెలో దాచిపెట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ట్రంక్ పెట్టెలో ఎలా దాచిందో..? ఎందుకు దాచిందో..? అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రియురాలిని కలిసేందుకు ప్రియుడు రాత్రివేళ ఆమె ఇంటికి వచ్చాడు. ఇద్దరు గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఊహించని ఓ సంఘటన జరిగింది. దాంతో ప్రియురాలు అతడిని ట్రంకు పెట్టెలో దాచాల్సిన పరిస్థితి వచ్చింది.

వారిద్దరూ గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె తల్లి తలుపు తట్టింది. దాంతో ఏం చేయాలో తెలియక ట్రంక్ పెట్టెలో ఉండాల్సిన బట్టలన్నీ బయటపడేసి అతడిని పెట్టెలో దాచింది. ఆ తల్లి ట్రంకు పెట్టెలో ఉండాల్సిన వస్తువులు చిందరవందరగా ఉన్నాయని ఆ యువతిని నిలదీసింది.

ఆ యువతి తాను ఏం చేయలేదని బుకాయించే ప్రయత్నం చేసింది.  కానీ ఆమె ప్రవర్తన పై ఆమె తల్లి, సోదరుడు అనుమానం వచ్చి ట్రంక్ పెట్టెను తెరవాల్సిందని గట్టిగా చెప్పారు. అయితే ట్రంకు పెట్టను తెరవనని.. అందులో ఏం లేదని చెప్పినప్పటికీ సోదరులు గట్టిగా చెప్పడంతో ట్రంకు పెట్టెను తెర్చాల్సి వచ్చింది.

ట్రంకు పెట్టె ఓపెన్ చేస్తున్న సమయంలో ఆమె సోదరుడు వీడియో తీశాడు. అంతే పెట్టె తెచ్చుకోగానే దాంట్లో నుంచి ఓ యువకుడు బయటపడ్డాడు. అది చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

బయటకు వచ్చిన యువకుడు తనకేమీ తెలియదు అన్నట్లుగా వెనుక వైపున నిలబడ్డాడు. ఈ ఘటన నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ సంఘటన చూసిన వారంతా ట్రంక్ పెట్టెలో ఎలా దాచింది.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

VIDEO :

https://twitter.com/Viralvibes07/status/1846777359468200155?t=UtQ2VzB5VGJL93R2VZK_wA&s=19

 VIDEOS :

మరిన్ని వార్తలు