Breaking Newsతెలంగాణనల్గొండ

Miryalaguda : NH 167 విస్తరణకు గడువు ముగిసినా ఖాళీ చేయని ఇళ్ల యజమానులు.. సబ్ కలెక్టర్ నోటీసులు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రోడ్డు వెడల్పు లో భాగంగా షాపులు, ఇల్లు ఖాళీ చేయాలని మరోసారి సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ నోటీసులు జారీ చేశారు.

Miryalaguda : NH 167 విస్తరణకు గడువు ముగిసినా ఖాళీ చేయని ఇళ్ల యజమానులు.. సబ్ కలెక్టర్ నోటీసులు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రోడ్డు వెడల్పు లో భాగంగా షాపులు, ఇల్లు ఖాళీ చేయాలని మరోసారి సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ నోటీసులు జారీ చేశారు. స్వచ్ఛందంగా రోడ్డు స్థలం వదిలి సెట్ బ్యాక్ వదిలి ఇళ్ళు నిర్మించుకునే వారికి ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లించింది.

గతంలో నోటీసులు ఇచ్చి 60 రోజులు ముగిసినప్పటికీ కూడా ఇంకా కొంతమంది షాపులు, ఇల్లు ఖాళీ చేయకపోవడంతో సబ్ కలెక్టర్ మరోసారి నోటీసులు జారీ చేశారు.
సబ్-కలెక్టర్ కార్యాలయం నుండి రెండవ 3E నోటీసు గణేష్ మార్కెట్ సమీపంలో తక్షణమే ఖాళీ చేయుటకు గాను నోటీసులు జారీ చేయడం జరిగింది.

అనంతరం ఆయన మాట్లాడుతూ
మిర్యాలగూడ పట్టణంలో NH–167 రోడ్డు విస్తరణ పనులు అడ్వాన్స్‌ దశకు చేరుకున్నాయని అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో ఒక కిలోమీటర్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరగనున్నాయి. గణేష్ మార్కెట్ నుండి రాజీవ్ చౌక్ వరకు 90 అడుగులు., రాజీవ్ చౌక్ నుండి సుధా బ్యాంక్ వరకు 84 అడుగుల వెడల్పుతో ఫోర్ లేన్ బీటీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, ఫుట్‌పాత్‌లు మరియు డ్రైనేజ్ సౌకర్యం వంటివి ఏర్పాటు చేయబడుతున్నాయి.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.54 కోట్ల భూసేకరణలో భాగంగా రూ.44 కోట్లు, (205) మంది లబ్ధిదారులకు ఇప్పటికే నష్ట పరిహారం చెల్లించడం జరిగింది. మిగిలిన (55) మంది లబ్ధిదారులు సబ్‌-కలెక్టర్ కార్యాలయంలో తమ డాక్యుమెంట్లు సమర్పించి పరిహారం పొందవలసిందిగా కోరనైనది. సబ్-కలెక్టర్ కార్యాలయం నుండి రెండవ 3E నోటీసు జారీ చేయడం జరిగింది మరియు ఇచ్చిన 60 రోజుల గడువు కూడా ముగిసింది.

షాపులు, ఇళ్ల యజమానులు అందరూ స్వచ్ఛందంగా ఖాళీ చేసి డిస్మాంటిలింగ్‌కు సహకరించవలసిందిగా కోరుతున్నాము.
డిస్మాంటిల్ సమయంలో రోడ్డుకు అవసరమైన స్థలాన్ని వదిలి సెట్బ్యాక్ పాటిస్తూ వెనక్కి కట్టుకోవాలి. మున్సిపల్ అనుమతి కూడా సెట్ బ్యాక్ ఉన్నప్పుడే ఇవ్వబడుతుంది. అందరూ కూడా NH–167 రోడ్డు విస్తరణ పనులకు సహకరించవలసిందిగా కోరనైనది.

MOST READ 

TG News : ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!

Urea App : రైతులు యూరియా యాప్ గురించి తెలుసుకోవల్సిందే.. అధికారులు ఏం చెప్పారంటే..! 

Miryalaguda : మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఆగని వలసలు.. బీ ఆర్ ఎస్ లో భారీగా చేరికలు..!

ఆయిదేళ్లుగా స్టూడెంట్‌తో టీచర్ ప్రేమ.. తన భర్త తనకు కావాలంటూ భార్య ఆవేదన..!

మరిన్ని వార్తలు