క్రైంBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

Sarpanch Elections : పంచాయతీ ఎన్నికల ప్రచారం బంద్..!

Sarpanch Elections : పంచాయతీ ఎన్నికల ప్రచారం బంద్..!

​కరీంనగర్, మనసాక్షి:

​కరీంనగర్ జిల్లాలో ఈనెల 11వ తేదీన గురువారం జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ప్రచారంపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కీలక ఆదేశాలు జారీ చేశారు.

తొలి విడత ఎన్నికలు జరిగే చొప్పదండి, గంగాధర, రామడుగు, కరీంనగర్ రూరల్, మరియు కొత్తపల్లి అనే ఐదు మండలాల పరిధిలో నేటి సాయంత్రం 5:00 గంటల (17:00 గంటల) వరకు మాత్రమే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని స్పష్టం చేశారు.

ఆ తర్వాత బహిరంగ ప్రచారానికి అనుమతి ఉండదని తెలిపారు. ​నిషేధాజ్ఞల అమలు ఎన్నికల సజావుగా నిర్వహణ కోసం ఇప్పటికే ఈ ఐదు మండలాల్లో నిషేధాజ్ఞలు మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి (సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్ ) అమలులోకి వస్తాయని తెలిపారు.

ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు. ​మద్యం దుకాణాలు బంద్ సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ​పోలింగ్ వివరాలు పోలింగ్ డిసెంబర్ 11వ తేదీ, గురువారం ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించబడుతుందన్నారు. ​

ఓట్ల లెక్కింపు పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు (డిసెంబర్ 11న) సాయంత్రం ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం హెచ్చగారించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

MOST READ 

  1. Nalgonda : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా..!

  2. Suryapet : 22 ఏళ్లు దేశ రక్షణలో విధులు.. గ్రామానికి సేవ చేసేందుకు సర్పంచ్ బరిలో..!

  3. Theft : పూజారి ఇంట్లో భారీగా 40 తులాల బంగారం, నగదు చోరీ..!

  4. TG News : తెలంగాణ రైజింగ్, గ్లోబల్ సమ్మిట్ రేపటి నుంచే.. ఏంచేస్తారో తెలుసా..!

మరిన్ని వార్తలు