Groups : డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎంపికైన పంచాయతీ కార్యదర్శి..!
Groups : డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎంపికైన పంచాయతీ కార్యదర్శి..!
గుర్రంపోడు, మన సాక్షి :
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జిన్నాయి చింత గ్రామానికి చెందిన ముడుసు శ్రీకాంత్ ఇటీవల విడుదల చేసిన గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల్లో 900 మార్కులకు 475 మార్కులు సాధించి డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
శ్రీకాంత్ 1 నుండి 5 తరగతి వరకు జిన్నాయిచింతలోని ప్రాథమిక పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు గుర్రంపోడు మండల కేంద్రంలోని నవోదయ ఉన్నత పాఠశాలలో, కొండమల్లేపల్లి శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ, హైదరాబాదు నిజాం కాలేజీ నందు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తిచేసి తన ప్రతిభతో రైల్వే, ఫారెస్ట్ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు ఎంపికై ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన శ్రీకాంత్ పట్టుదలతో చదివి గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ గ్రూప్ వన్ ఉద్యోగానికి ఎంపికైన సందర్భంగా జిన్నాయిచింత గ్రామస్తులు, ఆయన స్నేహితులు,చిన్ననాటి ఉపాధ్యాయులు శ్రీకాంత్ ను అభినందించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో గురువులు నేర్పిన క్రమశిక్షణాయుతమైన విద్యా బోధన వల్ల తాను జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగానని, తనకు చదువు నేర్పిన గురువులకు కలకాలం రుణపడి ఉంటానని తెలియజేశారు.
MOST READ :
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!
-
Miryalaguda : మూసి ఎడమ కాలువ పరిధిలో ఎండిపోతున్న పంట పొలాలు.. పరిశీలించిన సీపీఎం బృందం..!
-
PDS : పిడిఎస్ బియ్యం భారీగా పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు..!
-
Miryalaguda : ఫర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స్ దాడులు.. కాలం చెల్లిన మందుల పట్టివేత.. యాజమాన్యాలపై కేసులు..!
-
Fake Dsp : నకిలీ డి.ఎస్.పి.. ఇదో పెద్ద కథ.. అరెస్టు చేసిన పోలీసులు..!









