Breaking Newsఆదిలాబాద్జిల్లా వార్తలుతెలంగాణ

Seethakka : పప్పు, ఉప్మా అంటే విరక్తి.. సీతక్క..!

Seethakka : పప్పు, ఉప్మా అంటే విరక్తి.. సీతక్క..!

మన సాక్షి :

నేను నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టాను.. చిన్నప్పటి నుంచి ఇంట్లో పప్పు ఎక్కువగా వండేవారు.. ఆ తర్వాత హాస్టళ్లలో కూడా పప్పు ఎక్కువగా వడ్డించారు.. అజ్ఞాతంలో ఉప్మా తినేవాళ్లం. దీంతో పప్పు భోజనం, ఉప్మా అంటే అసహ్యం కలిగింది’ అని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

12 శాతం హిమోగ్లోబిన్‌ ఉండాల్సి ఉండగా, ఎప్పుడూ 8 శాతమే ఉండేదన్నారు. ఐదేళ్ల క్రితం తాను కూడా రక్తహీనతతో బాధపడ్డానని, ఇప్పుడు దాని నుంచి కోలుకున్నానని చెప్పారు. ఆశ్రమ పాఠశాలల్లో చాలా మంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని పేర్కొంటూ ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి ఖుష్బుగుప్తా మంచి కార్యక్రమం అమలు చేయడం అభినందనీయమన్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో గిరి జన పోషణ మిత్రను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉన్నతాధికారులు తమ ఆలోచనలతో ఆడబిడ్డల సంక్షేమానికి కృషి చేయడం అభినందనీయమన్నారు.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు