TG News : రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన పేట దివ్యాంగులు..!
TG News : రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన పేట దివ్యాంగులు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 27, 28 తేదీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వికలాంగుల క్రీడా పోటీలలో నారాయణపేట జిల్లా దివ్యాంగ క్రీడాకారులు పాల్గొని ప్రతిభ కనబరిచారు.
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో జిల్లా నుంచి జోసెఫ్, మౌనిక, ఆశమ్మ, జ్యోతి, నాగమ్మ, ఆంజనేయులు, లక్ష్మి, షిరిష, పాల్గొనగా జోసెఫ్ షాట్ పుట్, బాలుర ఆర్థోపెడిక్ జూనియర్ విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి సాధించగా, సీనియర్ అంధుల రన్నింగ్ మరియు షాట్ పుట్ లో రెండవ బహుమతులను నాగమ్మ గెలుచుకుంది.
అలాగే ఆర్థోపెడిక్ జూనియర్ విభాగం క్యారమ్ లో శిరీషా రెండవ బహుమతి సాధించి, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి శైలజ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. కాగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను శనివారం జిల్లా సంక్షేమ అధికారి జయ, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.
MOST READ :









