రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత
వేములపల్లి, ఆగస్టు17, మన సాక్షి : వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తుండగా ఒకరని పట్టుకున్నట్లు గురువారం ఎస్ ఐ శ్రీను తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన సింగం సతీష్ వివిధ గ్రామాల నుంచి 25 క్వింటాల రేషన్ బియ్యాన్ని సేకరించి తన ఇంట్లో నిల్వ చేయగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు కాగా రేషన్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి సివిల్ సప్లయ్ అధికారులకు స్వాధీన పరుస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడు సింగం సతీష్ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.