తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Nalgonda : కాంగ్రెస్ పాలనపై ప్రజలలో రోజురోజుకు వ్యతిరేకత..!

Nalgonda : కాంగ్రెస్ పాలనపై ప్రజలలో రోజురోజుకు వ్యతిరేకత..!

నల్లగొండ, మన సాక్షి.

కాంగ్రెస్ పాలనపై ప్రజలలో రోజురోజుకు వ్యతిరేకత వస్తుందని రైతులకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష తలపెడితే ప్రభుత్వం భయపడి అనుమతి నిరాకరించిందని అలాగే రైతు దీక్షకు సంబంధించిన పోస్టర్లను తీసివేయించిందని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పై దాడి చేశారని దాడులకు బిఆర్ఎస్ బయపడదని పద్ధతి మార్చుకోకుంటే ప్రతిఘటన తప్పదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకల్లు జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.

మంగళవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
కాంగ్రెస్ నేతలు రైతు భరోసా ఎగ్గొట్టారు పంటలు వేయడం లేదు అందుకే భరోసా ఇవ్వడం లేదు అని రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.. రుణమాఫీ, బోనస్ అన్ని విషయాల్లో పచ్చి మోసం చేశారు.

ధాన్యం కొనుగోళ్లలో అయోమయం చేశారు. అన్ని తప్పుడు లెక్కలు చెప్పారని రైతు కూలీలను మోసం చేశారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకల్లుచర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఇవ్వాళ నిర్వహించిన గ్రామ సభల్లోనే తేట తెల్లం అయిందని ప్రభుత్వం డొల్లతనం దరఖాస్తు లు అన్నింటిని చెత్త బుట్టలో వేశారని గ్రామ సభల్లో ప్రజల చైతన్యం కనపడిందని అన్ని గ్రామాల్లో ప్రజలు తిరగబడ్డారని ప్రభుత్వం పై నిరసనలు మొదలయ్యాయి అన్నారు.

ఇన్నాళ్లు దైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారని ఇక కాంగ్రెస్ నాయకులు తప్పించుకోలేరని ప్రజాక్షేతం లో గుణపాఠం తప్పదు అని హెచ్చరించారు. ఆరు గ్యారంటీ లు అన్ని తుంగలో తొక్కారు. అందుకే భౌతిక దాడులు చేస్తున్నారు.

నల్లగొండ లో భూపాల్ రెడ్డి పై దాడి చేయడం హేయమైన చర్య… కావాలని కేటీఆర్ ధర్నాను అడ్డుకున్నారు… కేటీఆర్ పెరు వింటేనే భయబ్రాంతులకు గురవుతున్నారు మంత్రులు పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తలలుగా పని చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం భయపడూతుందని నల్లగొండ ను అభివృద్ధి చేసింది మిము కాంగ్రెస్ హయంలో నల్లగొండ ఆగం అయింది…1500 కోట్లతో నల్గొండ ను అభివృద్ధి చేసినంగులాబీ జెండాలను చూసి కోమటిరెడ్డి కి భయం వేస్తోంది. కోమటిరెడ్డి ఊళ్లలోకి పోతే తిరుగుబాటు తప్పదు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. చేసిన అభివృద్ధి పై చర్చకు రా చూపిస్తాం ప్రతి గ్రామంలో నిను వేసిన శిలాఫకాలు అభివృద్ధి పనులు కనపడతాయి.

ఏ గ్రామానికి పొదమో పా చర్చ పెడదాం అభివృద్ధి కనబడుతోంది కాంగ్రెస్ నాయకుల వల్లనే కరువు ఫ్లోరైడ్ పెరిగిందని అన్నారు.మిము వచ్చి జిల్లా ను సస్యశ్యామలం చేసినం జాగ్రత్త కాంగ్రెస్ నాయకుల్లారా ఖబడ్దార్ అతిగా చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు.

ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్. ఎమ్మెల్సీ కోటిరెడ్డి. టిఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, కంచర్ల కృష్ణారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, తండు సైదులు గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, కరీం బాషా, జమాల్కాద్రి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : రేషన్ కార్డు కోసం ప్రభుత్వ ఉద్యోగుల ధరఖాస్తు.. డబుల్ దరఖాస్తులతో అధికారులకు తలనొప్పి..!

  2. TG News : వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. జాబితా రెడీ.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!

  4. Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!

మరిన్ని వార్తలు