Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!
Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!
మనసాక్షి , వెబ్ డెస్క్:
ప్రస్తుతం మొబైల్ లో నెట్ వాడకం పెరిగింది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తూ ఇంటర్నెట్ లను వినియోగిస్తున్నారు. ఒక్కోసారి ఫోన్ కొత్తగా ఉన్నప్పటికీ స్లో అవుతుంది. నెట్ సిగ్నల్ లేదనుకొని వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటారు . కానీ అలా కాకుండా ఇంటర్నెట్ స్పీడ్ లేకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. మీరు ఇంటర్నెట్ స్పీడ్ లేక ఇబ్బందులు పడుతున్నారా..? మీ నెట్ స్పీడ్ ని పెంచే ట్రిక్స్ తెలుసుకోండి.. మీ మొబైల్ లో ఈ ట్రిక్స్ ను వినియోగిస్తే నెట్ స్పీడ్ వేగంగా పెరుగుతుంది.
నెట్ స్పీడ్ పెంచడం ఎలా :
ఫోన్ ఇంటర్నెట్ నెమ్మదిగా ఉంటే అనేక సమస్యలు వస్తుంటాయి. మనం ఏదైనా ఓపెన్ చేసిన సమయంలో త్వరగా ఓపెన్ కాక చికాకు తెప్పిస్తాయి. దాంతో మనం నెట్ వినియోగంపైనే చికాకు కలుగుతుంది. దానివల్ల పనులు కూడా ఆగిపోతుంటాయి. ఇంటర్నెట్ వినియోగించకుంటే స్మార్ట్ ఫోన్ ఉన్న ఫీచర్ ఫోన్ లాగానే మిగిలిపోతుంది. వేగవంతమైన ఇంటర్నెట్ ను కలిగి ఉండటం చాలా ముఖ్యమైన విషయం.
మీ ఫోన్ నెట్ స్లో అయినప్పుడు :
మీరు కొన్ని సెట్టింగ్స్ లను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేగాన్ని ఎలా పెంచుకోవాలో.. తెలుసుకుందాం. మీ నెట్ వర్క్ లో తక్కువ మంది ఉన్నప్పుడు వైఫై, సెల్యులర్ కనెక్షన్ వేగంగా ఉంటుంది. చాలా పరికరాలు బ్యాండ్ విడ్త్ ని ఉపయోగిస్తూ ఉంటే మీ నెట్ వర్క్ కనెక్షన్ స్లో అవుతుంది . మీ బ్రౌజర్ క్యాచ్ హోల్డర్ లో క్యాచ్ డేటాను స్టోర్ చేస్తుంది. దాని వల్ల మీరు సందర్శించే వెబ్ సైట్లను త్వరగా ఓపెన్ అయ్యేలా చేస్తుంది. ఇది మీ నెట్ బ్రౌజింగ్ వేగవంతం చేసినప్పటికీ క్యాచ్ వల్ల మీ ఫోన్ పని తీరు స్లో అవుతుంది.
ALSO READ : Crime News : దొంగతనాలకు పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్స్.. చాకచక్యంగా పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు..!
క్యాచే (Cache) ఒక పెద్ద కారణం అయి ఉండవచ్చు :
మెమొరీ నిండినప్పుడు అది మీ ఫోన్ నెట్ వేగాన్ని తగ్గిస్తుంది. దానివల్ల మీరు వారానికి ఒక్కసారైనా మీ ఫోన్ ని స్కాన్ చేయాలి. ఈ స్కాన్ లో అనవసరమైన ఫైల్స్ క్యాచే వివరాలు చూపించి డిలీట్ చేయాలా..? లేదా..? అని అడుగుతుంది. డిలీట్ చేయడం ద్వారా మీ ఫోన్ పెర్ఫార్మన్స్ పెరిగి నెట్ స్పీడ్ పెరుగుతుంది. ఈ విధంగా స్కాన్ కోసం మీకు ప్లే స్టోర్ లో స్మార్ట్ ఫోన్ క్లీనర్ యాప్ లు చాలా ఉంటాయి.
నెట్ వర్క్ సెట్టింగ్స్ :
మీ ఫోన్ నెట్ వర్క్ సెట్టింగ్ లు కూడా నెట్ స్లో కావడానికి కారణం కావచ్చును. కొన్నిసార్లు ఈ సెట్టింగ్ లు పాడైపోయి మీ మొబైల్ ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. మీ ఫోన్ కనెక్షన్ ని వేగవంతం చేయడానికి మీ నెట్ వర్క్ సెట్టింగ్ లను రీసెట్ చేయాలి. ఆ తర్వాత ఫోను రీస్టార్ట్ చేయాలి. బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ఒకేసారి చాలా యాప్ లను రన్ చేయడం వల్ల మీ ఇంటర్నెట్ స్పీడు తగ్గుతుంది. బ్యాక్ గ్రౌండ్నలో చాలా యాప్‌లను తెరవడం వల్ల మీ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గే అవకాశం ఉంది. RAM ర్యామ్ ని ఖాళీ చేయడానికి మీ ఇంటర్నెట్ వేగాన్ని పెంచడానికి మీరు ఉపయోగించని యాప్ లను ఎప్పటికప్పుడు తొలగించుకోండి.
ALSO READ : Big Alert : టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
అప్డేట్ :
ఆటోమేటిక్ అప్డేట్ లు చాలా డేటాను వినియోగిస్తుంటాయి. ఇది ఇంటర్నెట్ వేగాన్ని కూడా తగ్గిస్తుంది. దానివల్ల ఇంటర్నెట్ వేగం లేకపోతే యాప్ లో ఆటోమేటిక్ అప్డేట్లను ఆపేయండి. నెట్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. వైఫై ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే అప్డేట్ చేయాలని ఆప్షన్ కూడా సెట్టింగ్స్ లో ఎంపిక చేసుకోండి.
రీస్టార్ట్ :
కొన్ని పర్యాయాలు ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేర్ చేయడానికి రీబూట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ మొబైల్ ని పూర్తిగా ఆఫ్ చేసి ఒక నిమిషం తర్వాత దాన్ని తిరిగి పున ప్రారంభించండి. అంతేకాకుండా మీరు మీ మొబైల్ ఫోన్ ను కనీసం 5 సెకండ్ల పాటు ఎయిర్ ప్లేన్ మోడ్ కి మారవచ్చు. ఆ తర్వాత తిరిగి నార్మల్ మోడ్ పెట్టుకోవచ్చు. ఇలాంటి చిట్కాలు ఉపయోగించడం వల్ల మొబైల్ నెట్ వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ALSO READ : Hundred Rupees : ఇవ్వాల్సిన బాకీ రూ. 100 ఇవ్వమని అడిగినందుకు..!










