UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!
మన సాక్షి :
డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇంట్లోనే ఉండి అన్ని రకాల బిల్లులు చెల్లించే సౌకర్యం ఉంది. ఇప్పటివరకు ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయని యూపీఐ లు కూడా ఇకపై చార్జీలు వసూలు చేయనున్నాయి. అవేంటో చూద్దాం..
యుపిఐ (UPI) వినియోగదారులకు భారీ జలక్ ఇచ్చింది. ఇది ఒక రకంగా వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చును. ఇకపై పేమెంట్ లపై చార్జీల మోతమోగనుంది. తక్కువ మొత్తం యూపీఐ లావాదేవీలు రూపే, డెబిట్ కార్డు చెల్లింపులకు ప్రభుత్వ సపోర్టు తగ్గడంతో యూపీఐ యాప్ లు నష్టాన్ని పూడ్చుకునే పనిలో ఉన్నాయి.
దాంతో ఇకనుంచి యూపీఐ నుంచి కన్వీనియన్స్ చార్జీలను వసూలు చేయడం ప్రారంభించాయి. గూగుల్ పే వంటి ప్లాట్ఫామ్ లు విద్యుత్, వంటగ్యాస్, క్రెడిట్ కార్డు లావాదేవీలతో సహా బిల్లు చెల్లింపులపై చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవి గతంలో తక్కువ విలువైన చెల్లింపులను ఉచితంగా అందజేశాయి. నేరుగా బ్యాంకు ఖాతాలకు లింకు చేయబడిన యూపీఐ లావాదేవీలకు మాత్రం చార్జీలు ఉండవు.
యూపీఐ (UPI), రూపే(RUPAY), డెబిట్ కార్డు రియంబర్స్మెంట్ ల కోసం బడ్జెట్ కేటాయింపులు గత ఏడాది కంటే తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం 2024లో 2484 కోట్లుగా ఉన్న కేటాయింపులకు 2025లో 2000 కోట్లకు తగ్గించింది. దాంతో పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్లు, థర్డ్ పార్టీ ప్రొవైడర్లు పునరా ఆలోచనలో పడ్డాయి. దానివల్ల యూపీఐ పేమెంట్ లకు చార్జీలు వసూలు చేస్తున్నాయి.
Similar News :
- UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!
- UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!
- UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
- GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !









