క్రైంBreaking Newsజిల్లా వార్తలునిర్మల జిల్లా

డయల్ 100 కు ఫోన్.. రెండు రోజుల జైలు శిక్ష.. ఎందుకో తెలిస్తే షాక్..!

డయల్ 100 కు ఫోన్.. రెండు రోజుల జైలు శిక్ష.. ఎందుకో తెలిస్తే షాక్..!

నిర్మల్ , (మన సాక్షి)

డయల్ 100 కు మద్యం మత్తులో పలుమార్లు ఫోన్ చేసి విసిగించాడు ఓ వ్యక్తి. అతనిపై కేసు పెట్టిన పోలీసులు కోర్టులో హాజరు పరచగా రెండు రోజుల జైలు శిక్ష విధించారు.

ఖానాపూర్ మండలం రామ్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివరాత్రి లక్ష్మణ్  అనే వ్యక్తి ఈనెల 5వ తేదీన అధిక మద్యం తాగి డయల్ 100 నెంబర్ కు అకారణంగా పలుమార్లు ఫోన్ చేస్తూ పోలీసు వారి యొక్క విలువైన సమయాన్ని వృధా చేయించాడు.

న్యూసెన్స్ చేసినటువంటి పై వ్యక్తి పై న్యూ సెన్స్ కేసు పెట్టి కోర్టు కు హాజరుపరచగా మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించరని ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదారావు మరియు ఎస్సై జి. లింబాద్రి తెలిపారు.

LATEST UPDATE : 

Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

సింగూరు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. ఇక రెండు పంటలకు డోకా లేదు..!

మరిన్ని వార్తలు