Breaking NewsTOP STORIES

Aadhaar : ఆధార్ కార్డులో ఫోటో బాలేదా.. మార్చుకోవాలంటే వెరీ సింపుల్..!

Aadhaar : ఆధార్ కార్డులో ఫోటో బాలేదా.. మార్చుకోవాలంటే వెరీ సింపుల్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ప్రస్తుతం మన దేశంలో ఆధార్ కార్డు ప్రధాన గుర్తింపు కార్డుగా ఉపయోగిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారింది. యు ఐ డి ఏ ఐ ( UIDAI) జారీ చేసిన 12 డిజిట్ నెంబర్లు ఈ ఆధార్ కార్డులో ఉంటాయి. దాదాపు అన్ని పనులకు కూడా ఆధార్ కార్డుని ఉపయోగిస్తున్నారు.

ఆధార్ కార్డు ప్రామాణికంగా అన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. బ్యాంకు సేవలు ఇతర ప్రధాన పనులన్నింటికీ కూడా ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆధార్ కార్డులో ఫోటో బాగా కనిపించక పోవడం వల్ల కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. అందుకు ఆధార్ కార్డులో ఫోటోను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంద

ఆధార్ కార్డులో కొన్ని వివరాలను ఆన్‌లైన్ లో ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఫోటో మార్చుకోవడం మాత్రం వీలుండదు. ఈ ఎడిట్ కోసం తప్పనిసరిగా ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సి ఉంది. ఫోటో అప్డేషన్ కావాలంటే లైవ్ లో దిగిన ఫోటోలు మాత్రమే ఉపయోగిస్తారు. పాత లేదా పర్సనల్ ఫోటోలను ఆధార్ యాక్సెప్ట్ చేయదు. అందుకోసం ఆధార్ యూజర్లు తమ ఫోటోను మార్చుకోవాలంటే సమీపంలోని ఆధార్ సెంటర్ కు వెళ్లాలి.

ఫోటో అప్డేషన్ కోసం ఫీజు వంద రూపాయలు చెల్లించాలి. అదనంగా జీఎస్టీ కూడా ఉంటుంది. ఈ పేమెంట్ అయిన తర్వాత ఫోటో చేంజ్ చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. నేరుగా ఆధార్ సెంటర్ లో ఫోటోలు దిగి మార్చుకోవచ్చు. అయితే మార్పు కావడానికి కొంత సమయం పడుతుంది. సుమారుగా 15 నుంచి 30 రోజుల వరకు సమయం పడుతుంది. ఒక్కోసారి ఎక్కువ కూడా పట్టొచ్చు. అయినా కూడా ఆధార్ కార్డులో లేటెస్ట్ ఫోటో ఉండటం వల్ల ఎలాంటి చిక్కులు లేకుండా ఉంటుంది.

MOST READ 

  1. సోనియా గాంధీకి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్.. అందజేసిన సీ ఎం రేవంత్..!

  2. TET : తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్ష తేదీలు ఇవే..!

  3. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

  4. TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇక నో టెన్షన్..!

మరిన్ని వార్తలు