TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : చింతపల్లి రోడ్ లో చిమ్మ చీకట్లు.. భయాందోళనలో ప్రజలు..!

Miryalaguda : చింతపల్లి రోడ్ లో చిమ్మ చీకట్లు.. భయాందోళనలో ప్రజలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చింతపల్లి రోడ్ లో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. మున్సిపాలిటీలోని 48 వార్డులు ఉండగా 6వ వార్డు చింతపల్లి రోడ్ లో ఇందిరమ్మ కాలనీ ఉంటుంది. ఆ రోడ్డుకు వెళ్లాలంటేనే చీకటైతే ప్రజలు భయపడుతున్నారు.

పట్టణంలో వివిధ పనులు ముగించుకొని వెళ్లాలంటే చిమ్మ చీకట్లో వెళ్లాల్సి వస్తుంది. అద్దంకి – నార్కట్ పల్లి జాతీయ రహదారి నుంచి కేవలం ఆఫ్ కిలోమీటర్ దూరంలోనే ఇందిరమ్మ కాలనీ ఉంటుంది. కానీ అద్దంకి నార్కట్ పల్లి రహదారి నుంచి ఇందిరమ్మ కాలనీ వరకు వీధిలైట్లు లేవు. ఆ రోడ్ లో 11 కెవి విద్యుత్ లైను ఉంటుంది.

ఆ లైన్ తోపాటు స్ట్రీట్ లైట్ల లైను కూడా ఏర్పాటు చేసి వీధిలైట్లు వేయవచ్చు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదు. చింతపల్లి రోడ్ నుంచి ఇందిరమ్మ కాలనీ, చింతపల్లి, దిలావర్ పూర్ తో పాటు పలు తండాలకు ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు.

కానీ చీకటైతే అద్దంకి నార్కట్ పల్లి రహదారి నుంచి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. రోడ్డు పక్కన పంట పొలాలు ఉండటం వల్ల వెళ్లే వారు భయాందోళనలు చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై దృష్టి సారించి స్ట్రీట్ లైట్లు వేయాలని ఇందిరమ్మ కాలనీవాసులు పేర్కొంటున్నారు.

ALSO READ : 

SLBC : ఎస్ఎల్బీసి సొరంగం పూర్తి కి రూ.460 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్..!

మిర్యాలగూడ : అమావాస్య, వేప చెట్టు కింద మంత్రించిన కొబ్బరికాయలు, భయాందోళనలు.. రంగంలోకి జన విజ్ఞాన వేదిక..!

Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!

Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!

మరిన్ని వార్తలు