Insurance : బీమా కోసం ఇద్దరు అన్నదమ్ముల ప్లాన్.. రూ.3 కోట్ల కోసం.. కన్నతండ్రిని..!

Insurance : బీమా కోసం ఇద్దరు అన్నదమ్ముల ప్లాన్.. రూ.3 కోట్ల కోసం.. కన్నతండ్రిని..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
బీమా డబ్బుల కోసం ఇద్దరు అన్నదమ్ములు కన్న తండ్రిని పాముకాటుతో చంపిన అమానవీయ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీమా సొమ్మును అందజేసేందుకు విచారణ చేపట్టిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన గణేషన్ (56) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగశాల సహాయకుడిగా పనిచేస్తున్నాడు.
అతడు అక్టోబర్ మాసంలో పాముకాటుతో మరణించినట్లు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అంత్యక్రియల అనంతరం మృతుడి పేరు మీద ఉన్న మూడు కోట్ల రూపాయల బీమా కోసం అతడి కుమారులు ఇద్దరు భీమా సంస్థను ఆశ్రయించారు.
గణేషన్ పేరు మీద అధిక విలువగల పాలసీలు ఉండడంతో పాటు కుమారుల ప్రవర్తన పై అనుమానం వచ్చిన బీమా సంస్థ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో గణేషన్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.
తండ్రి పేరు మీద మూడు కోట్ల రూపాయలకు భీమ చేయించి తండ్రిని పాముకాటుతో చంపించినట్లుగా గుర్తించారు. పథకం ప్రకారమే బీమా కూడా చేయించారని, ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా నమ్మించడానికి పాముకాటుతో చంపాలని కుట్ర పన్నినట్టు స్పష్టమైనది.
అంతేకాకుండా గణేషన్ ని అంతకు ముందే కూడా పాముకాటుతోనే చంపేందుకు ప్రయత్నించగా అది విషపూరితమైన పాము కాకపోవడంతో అతను చనిపోలేదు. రెండవ ప్రయత్నంలో విషపూరితమైన పాము తో చంపించినట్లుగా స్పష్టమైనది. కాగా ఈ ఘటనలో ఇద్దరు కుమారులతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
MOST READ
-
Railway : శంకర్‌పల్లి ప్రజలకు శుభవార్త.. రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలుపుదల..!
-
Nalgonda : డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసానికి పన్నాగం.. రూ.18 లక్షల బదిలీకి యత్నం, పోలీసుల చాకచక్యం..!
-
Miryalaguda : రేపు విద్యుత్ బంద్.. మండలాలు వేళలు ఇవే..!
-
Aadhaar : ఆధార్ కార్డులో ఫోటో బాలేదా.. మార్చుకోవాలంటే వెరీ సింపుల్..!









