Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsనల్గొండ

Cyber : పీఎం కిసాన్ యోజన, ఎస్బిఐ రివార్డ్.. పేరుతో సైబర్ మోసాలు.. మెసేజ్ వస్తే ఎలా.. తెలుసుకుందాం..!

Cyber : పీఎం కిసాన్ యోజన, ఎస్బిఐ రివార్డ్.. పేరుతో సైబర్ మోసాలు.. మెసేజ్ వస్తే ఎలా.. తెలుసుకుందాం..!

నల్లగొండ, మన సాక్షి :

ఈ మధ్య కాలంలో పీఎం కిసాన్ యోజన ఎస్బిఐ రివార్డ్స్ వంటి నకిలీ మొబైల్ అప్లికేషన్లను వాట్సాప్ టెలిగ్రామ్ సోషల్ మీడియా ద్వారా పంపే లింకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాటిని క్లిక్ చేసి మోసపోవద్దని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మధ్య కాలంలో కొంత మంది సైబర్ నేరగాళ్లు పీఎంకిసాన్, ఎస్బిఐరివార్డ్ అనే ఏపీకే పైల్స్ వాట్సాప్ టెలిగ్రామ్ సోషల్ మీడియా ద్వారా పంపిస్తున్నారు.

పొరపాటున ఇలాంటి లింక్స్ క్లిక్ చేసి అప్లికేషన్ ఇన్స్టాల్ చేశారంటే మీ ఫోన్ హ్యాక్ అయి వినియోగదారుడి ఫోన్ లో గల ఓటిపిలులు, బ్యాంక్ వివరాలు మరియు వ్యక్తిగత వివరాలు చోరీ వారి అధీనంలోకి వెళ్తాయి అన్నారు. ఆపై బాధితుడి వాట్సాప్ ఖాతాను హైజాక్ చేసి, అదే నకిలీ లింక్ ను అతని ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ లకు ఆటోమేటిక్ గా పంపిస్తుందనీ,ఈ మోసాలకు సంబందించి ఇప్పటికే పలు కంప్లైంట్స్ నమోదయ్యాయి అన్నారు.

ఈ మోసాల ద్వారా బాధితులు ఆర్ధిక నష్టాలు,అక్రమ లావాదేవీలు డేటా గోప్యతా ఉల్లంఘనలను ఎదుర్కొన్నారు. ఇలాంటి నకిలీ ఏపీకే ఫైల్స్ మోసాల బారిన పడకుండ ఉండాలంటే ప్రజలు వాట్సాప్ లో అనుమానస్పద లింక్ లను క్లిక్ చేయరాదని, ఇలాంటి ఏపీకే లింక్స్ వచ్చినప్పుడు వాటిని వెంటనే తొలగించాలని పేర్కొన్నారు.

మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు లేదా ఓ‌టి‌పిలు ఎవరితోనూ షేర్ చేయకుండా ఉండాలని తెలిపారు. ఈలాంటి సమాచారం ప్రభుత్వ సంస్థలు అడగవు. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే సైబర్ క్రైమ్ ని లేదా 1930 టోల్ ఫ్రీ నంబరు కు కాల్ చేసి రిపోర్ట్ చేయగలరని సూచించారు.

(MOST READ)

ఎక్కువ మంది చదివిన వార్తలు

  1. Vaccine : మహిళలకు భారీ శుభవార్త.. ఆ వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్‌.. అందరికి మేలు..!

  2. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  3. Rythu : ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి.. కేంద్ర పథకాలకు ఇకపై అదే ప్రామాణికం..!

  4. TG News : తెలంగాణ మంత్రి మండలి కీలక తీర్మానం.. బీసీలకు 42% రిజర్వేషన్లు..!

  5. Gold Price : ఒక్కరోజే రూ.6600 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

మరిన్ని వార్తలు