Huzurnagar : సూర్యాపేట జిల్లాలో సంచలనం కలిగించిన అత్యాచారం, దాడి కేసులో పోలీసుల కీలక చర్య..!
Huzurnagar : సూర్యాపేట జిల్లాలో సంచలనం కలిగించిన అత్యాచారం, దాడి కేసులో పోలీసుల కీలక చర్య..!
హుజూర్‌నగర్, (మనసాక్షి):
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. చౌటుపల్లి గ్రామానికి చెందిన రోజా అనే మహిళ 12 సంవత్సరాల క్రితం కాశయ్యను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, 9 సంవత్సరాల క్రితం భర్త మృతి చెందడంతో, రోజా తన పిల్లలతో హుజూర్‌నగర్‌కు వలస వచ్చి, దుస్తుల షాప్ నడుపుతూ జీవనం సాగించింది.
అనంతరం అనారోగ్య కారణాలతో షాప్ మూసివేసి ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, 7 నెలల క్రితం తిలక్‌నగర్‌కు చెందిన నూకతొట్టి ప్రమోద్‌కుమార్, లచ్చిమాళ్ల హరీష్‌లతో రోజాకు పరిచయం ఏర్పడింది. ప్రమోద్‌కుమార్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదే సమయంలో రోజాకు ఓ యువతితో స్నేహం ఏర్పడింది.
తన బాయ్‌ఫ్రెండ్ ప్రమోద్‌కుమార్‌ను, హరీష్‌ను బాధిత యువతికి రోజా పరిచయం చేసింది.తేదీ 07.03.2025 న కొత్త బస్‌స్టాండ్ వద్ద ఉన్న బాధితురాలిని ప్రమోద్‌కుమార్ మాట్లాడాలని చెప్పి SV లాడ్జ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగించగా, మత్తులో ఉన్న బాధితురాలిపై లైంగిక దాడి చేసి, ఆ దృశ్యాలను వీడియోలు, ఫోటోల రూపంలో చిత్రీకరించాడు.
అనంతరం ఆమెకు వాటిని చూపించి, తన చెప్పినట్లు నడుచుకోవాలని, లేనిపక్షంలో వీడియోలు బయట పెడతానని బెదిరించాడు. తేదీ 18.03.2025 న ప్రమోద్‌కుమార్, హరీష్ కలిసి బాధితురాలిని మళ్లీ దోపిడీ చేయాలని నిర్ణయించారు. రోజా ద్వారా బాధితురాలిని పిలిపించగా, మద్యాహ్నం రోజా ఇంటి వద్దకు వచ్చిన బాధితురాలిని బలవంతంగా AP-16-DA-5280 నంబర్ గల కారులో ఎక్కించుకొని, హుజూర్‌నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెనుక ఉన్న నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లారు.
అక్కడ ఆమెను మళ్లీ లైంగికంగా వేధించాలని నిందితులు ప్రయత్నించారు. బాధితురాలు నిరాకరించగా, రోజా, ప్రమోద్‌కుమార్, హరీష్ కలిసి ఆమెను కర్రలతో కొట్టి, బట్టలు చించివేసి, ప్రాణహాని బెదిరింపులకు దిగారు. అనంతరం, బాధితురాలిని బలవంతంగా కారులో బంధించి, రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు తీసుకెళ్లి, తమతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని లిఖితంగా ఒప్పందం చేసుకుని సంతకం తీసుకున్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు Cr.No. 58/2025 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు, హుజూర్‌నగర్ CI చరమంద రాజు, SI ముత్తయ్య నేతృత్వంలో నిందితులు ప్రమోద్‌కుమార్, రోజాలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
మరో నిందితుడు లచ్చిమాళ్ల హరీష్ పరారీలో ఉన్నాడు. ప్రమోద్‌కుమార్‌పై ఇదివరకే హుజూర్‌నగర్, మట్టంపల్లి, గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. హరీష్‌ను కూడా త్వరలో అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
MOST READ :
-
Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై భారీ గుడ్ న్యూస్.. నిధుల కేటాయింపు..!
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. స్నేహితురాలిని ఇంటికి పిలిపించిన యువతి.. అత్యాచారం, ఫోటోలు, వీడియోలతో బెదిరింపు..!









