Police Attack : చిత్తుబొత్తు అట స్తావరంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్టు..!

Police Attack : చిత్తుబొత్తు అట స్తావరంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్టు..!
తూప్రాన్, మనసాక్షి :
చిత్తు బొత్తు అట ఆడుతున్న స్టావరంపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసి 3లక్షల 29వేల 500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. తూప్రాన్ సిఐ రంగా కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
వెల్దుర్తి మండలం పరిధిలోని దామరంచ అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు హెడ్స్ అండ్ టేల్స్(చిత్తు బొత్తు) అనే జూద ఆట ఆడుతున్నారని తెలిసిన సమాచారం మేరకు.. వెల్దుర్తి ఎస్‌ఐ సిబ్బందితో కలిసి ప్రత్యేక దాడి నిర్వహించారు. దాడి సమయంలో, అక్కడ జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుబడగా సుమారు మరో పది మందికి పైగా వ్యక్తులు పారిపోయినట్లు తెలిపారు.
దాడి సమయంలో సంఘటన స్థలంలో జూదంలో ఉపయోగించిన 5 మోటార్ సైకిళ్లు, 8 మొబైల్ ఫోన్లు మరియు రూ.3,29,500 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆటలో గల ప్రధాన వ్యక్తులు మరియు పరారీలో ఉన్నవారి వివరాలను సేకరించడానికి దర్యాప్తు జరుపుతున్నామని సిఐ తెలిపారు.
జూదం ఆడటం వలన గ్రామీణ ప్రాంతాల్లో చట్టం మరియు శాంతి భద్రతలకు భంగం కలగవచ్చని, ఇటువంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. ప్రజల సహకారంతో ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు.
MOST READ :
-
Ring : బొటనవేలికి వెండి ఉంగరం.. జ్యోతిష్య, ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం..!
-
US : అమెరికాలో భారీ పేలుడు.. 19 మంది మృతి..!
-
Mudivedu : ముదివేడు ప్రొబేషన్ ఎస్ఐగా శ్రావణి.. ఎవరో తెలుసా..!
-
District collector : ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!
-
Kissing : ముద్దు పెట్టుకుంటే ఇన్ని లాభాలా.. తెలుసుకోవల్సిందే..!









