Suryapet : వినాయక నిమజ్జనానికి 1500 మందితో పోలీసు బందోబస్తు..!

Suryapet : వినాయక నిమజ్జనానికి 1500 మందితో పోలీసు బందోబస్తు..!
సూర్యాపేట, మనసాక్షి :
జిల్లాలో ఈనెల 5,6 తారీఖులలో జరిగే గణేష్ నిమజ్జనానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవర్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలో గణేష్ నిమజ్జనం చేయు సద్దుల చెరువును పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు .
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట పరిధిలో నిమజ్జనం సంబంధించి ఆర్డిఓ, డిఎస్పి, మున్సిపల్ కమిషనర్ అన్ని శాఖల వారితో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేయించాలని. అలాగే మండల వ్యాప్తంగా, మున్సిపాలిటీ పరిధిలో గల కోదాడ, హుజూర్నగర్ తిరుమలగిరి లో ఎక్కువ విగ్రహాలు వస్తే ప్రణాళికలు సిద్ధం చేసుకుని రెవెన్యూ, పోలీస్, ట్రాఫిక్ , సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు రాకుండా గ్రహాలు ఒకదాని వెనుక ఒకటి వరుస క్రమంలో వచ్చి వచ్చి నిమజ్జనం చేయించాలని అన్నారు.
ఫిషరీస్, ఫైర్, ఇరిగేషన్ శాఖలవారు గజ ఈతగాళ్లను ఏర్పాటుచేసి నిమజ్జనం జరిగే రెండు రోజులు 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలని, డిఎం అండ్ హెచ్ ఓ , జి జి హెచ్ సూపర్డెంట్ వారి టీం తో టౌన్, మండలాలలో హెల్త్ క్యాంప్స్ మరియు అంబులెన్సు ఏర్పాటు చేయాలని. నిమజ్జనం చేయు ప్రదేశంలో క్రేన్స్ లొకేషన్, అప్లోడ్ పాయింట్, పూజా సామాగ్రి కలెక్షన్ పాయింట్ ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
రూరల్ పరిధిలో, టౌన్ పరిధిలో నిమజ్జనం జరిగే ప్రదేశాలలో పెద్ద విగ్రహాలు నిమజ్జనం జరిగే ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారో అక్కడ మాత్రమే నిమజ్జనం చేయాలని, వేరే చోట చేస్తే భద్రతపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని విగ్రహాలు సద్దుల చెరువు చేరుకోవడానికి రోడ్డు మ్యాప్ కూడా సిద్ధం చేశామని రూట్ మ్యాప్ ద్వారానే విగ్రహాల నిమజ్జనానికి రావాలని నిమజ్జనం తర్వాత ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా మరల వేరే దారిలో వెళ్లాలని కలెక్టర్ అన్నారు.
జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3200 విగ్రహాలు ఉన్నాయని, వీటిని నిమజ్జనం చేయుటకు గాను 1500 మంది పోలీసులను బందోబస్తు కొరకు వినియోగిస్తున్నామని , ప్రజలకు మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
విగ్రహాలను త్రాగునీటికి ఉపయోగించే పాలేరు రిజర్వాయర్లో, సాగర్ కెనాల్ లో నిమజ్జనం చేయరాదని, ఎక్కడైతే నిమజ్జనానికి ఏర్పాటు చేసామో అక్కడ మాత్రమే నిమజ్జనం చేయాలని వేరే ప్రదేశంలో, మూసి రిజర్వాయర్ లో కూడా నిమజ్జనం చేయరాదని ఆలా చేస్తే భద్రత పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని, నిమజ్జనం జరిగే 5,6 తారీఖులలో ఉదయం తొందరగా విగ్రహాలను నిమజ్జనానికి తీసుకొని వచ్చి సూర్యుడు అస్తమించే లోపు నిమజ్జనం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, డిఎస్పి ప్రసన్నకుమార్, మత్స్య ఇరిగేషన్, ఫైర్ శాఖల అధికారులు, సూర్యాపేట ఎమ్మార్వో గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు అనంతల కృపాకర్ ప్రధాన కార్యదర్శి రంగరాజు రుక్మారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చలమల్ల నర్సింహ, బైరు వెంకన్న గౌడ్, కారంగుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Miryalaguda : జడ్చర్ల-కోదాడ హైవె విస్తరణ పనులు వేగవంతం చేయాలి..!
-
TG News : తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!
-
Nalgonda : రైతుల ఘోస.. యూరియా కోసం తెల్లవారుజామునుంచే భారీ క్యూ..!
-
Nalgonda : రైతుల ఘోస.. యూరియా కోసం తెల్లవారుజామునుంచే భారీ క్యూ..!
-
Suryapet : పెన్ పహాడ్ ఎంపీఓ గా బాధ్యతలు స్వీకరించిన బీస్ రాజేశ్వర్.. ఎవరో తెలుసా..!









