Godavarikhani : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు..!

Godavarikhani : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు..!
గోదావరిఖని, మన సాక్షి:
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తగూడెం బుర్ర గడ్డకు చెందిన కోడూరి అభినవ్ వర్ధన్, స్థానిక శివాజీ నగర్ చెందిన చెరుకు శ్రీనివాస్ లు అడ్డగుంటపల్లి సిరి ఫంక్షన్ హాల్ వెనకాల గల చెట్ల పొగల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సాయి రమేష్ సిబ్బందితో కలిసి అక్రమ రవాణా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
కొత్తగూడెం కు చెందిన అభినవ్వర్ధన్ ఆటోడ్రైవర్ గా పని చేస్తూ వచ్చిన డబ్బులు సరిపోక జల్సాలకు అలవాటు పడి గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవలసిన ఉద్దేశంతో అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో గోదావరిఖని చెందిన శ్రీనివాస్ బంధువు కొత్తగూడెంలో ఉండగా అక్కడికి వెళ్లిన సమయంలో అభినవ్ తో శ్రీనివాస్ కు పరిచయం ఏర్పడింది.
పరిచయం కాస్తా స్నేహంగా మారి గంజాయి అక్రమ రవాణా కి ఇద్దరు ఒకటయ్యారు. అభినవ్ సీలేరు నుండి గుర్తు తెలియని వ్యక్తులు వద్ద గంజాయి తీసుకుని రాగా వారి దగ్గర నుండి తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకు చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముదావని ఉద్దేశ్యం తో శ్రీనివాస్ మొదటగా 250 గ్రాములు గంజాయి తీసుకువచ్చి ఒక వ్యక్తి తో అమ్మినాడు. అదే క్రమంలో శ్రీనివాస్ కూడా అభితో గోదావరిఖనిలో గంజాయికి మంచి డిమాండ్ ఉందని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని గంజాయి తీసుకొని వచ్చి గోదావరిఖనిలో అమ్మేవాడు.
అభినవ్ గతంలో కూడా వచ్చి అప్పుడప్పుడు శ్రీనివాస్ కు గంజాయి సరఫరా చేసినాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ గోదావరిఖని పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నిమజ్జనం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలోని యువతకు గంజాయి అమ్మినట్లయితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఉద్దేశంతో శ్రీనివాస్ అభినవ్ కి ఫోన్ చేసి ఒక కిలో గంజాయి కావాలని అట్టి కిలోకి 15000 వేలకు మాట్లాడి 5000 డబ్బులు ఇచ్చి మిగతావి గాంజాయ్ తీసుకు వచ్చినాక ఇస్తాను అని చెప్పగా అభినవ్ భద్రాచలం గోదావరి ఒడ్డు అటవీ ప్రాంతం నుండి ఒక కిలో గంజాయి పట్టుకుని రాగా నమ్మదగిన సమాచారం మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు పట్టుకోవడం జరిగిందని తెలిపారు.
గంజాయ్ అమ్మే నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ ఐ రమేష్, అనూష, క్రైమ్ పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ శ్రీనివాస్ సదానందం, కానిస్టేబుల్స్ రమేష్ మధుకర్ మధుసూదన్లను ఏసిపి అభినందించారు.
MOST READ :
-
Unispace : హైదరాబాద్ లోనే గృహ రూపకల్పన, భవన పరిష్కారాల కోసం.. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రం అపర్ణ యునిస్పేస్..!
-
District collector : గణేష్ నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ..!
-
LPG GAS : గ్యాస్ వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్.. తగ్గిన సిలిండర్ ధరలు..!
-
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. వారికి రూ.5 లక్షలు..!









