క్రైంBreaking Newsతెలంగాణహైదరాబాద్

పోలీస్ డిపి ఫోటో పెట్టుకొని.. ఫోన్ కాల్.. కొత్తరకం సైబర్ క్రైమ్..!

పోలీస్ డిపి ఫోటో పెట్టుకొని.. ఫోన్ కాల్.. కొత్తరకం సైబర్ క్రైమ్..!

మన సాక్షి , హైదరాబాద్ :

సైబర్ క్రైమ్ రోజురోజుకు పెరుగుతుంది. నేరగాళ్లు కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు.. ప్రజలను అవగాహణ పరుస్తున్నప్పటికీ ఇంకా సరికొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అపరిచితులు ఫోన్ కాల్స్ చేసి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలియజేస్తున్నారు.

పోలీస్ డిపి ఫోటో పెట్టుకుని అపరిచితులు ఫోన్ కాల్స్ చేసి మీకు సంబంధించిన వాళ్ళు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, ఇంకేదో పెద్ద తప్పు చేశారని టెన్షన్ పెట్టి బురిడీ కొట్టి ఇస్తారని అలాంటి ఫోన్ కాల్స్ పట్ల ప్రమాదంగా ఉండాలని తెలంగాణ డిజిపి ఒక వీడియో కాల్ సందేశం తో ప్రజలను అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో వీడియో కాల్ సందేశాన్ని పెట్టి అవేర్నెస్ కల్పిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించాలి.

 

ఇవి కూడా చదవండి : 

కృష్ణమ్మ పరవళ్ళు.. తెరుచుకున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు.. త్వరలో శ్రీశైలం, సాగర్ కు వరద..!

BREAKING : హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై గంజాయి రవాణా.. పోలీసులకు చిక్కిన మహిళ, మరో ఇద్దరు..!

మరిన్ని వార్తలు