Kalluru : గంజాయి స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు..!
Kalluru : గంజాయి స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు..!
కల్లూరు, (మన సాక్షి)
కల్లూరు పోలీసులు గంజాయి స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి ముగ్గురు గంజాయి వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్లు బుధవారం కల్లూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ రఘు వివరాలను తెలిపారు.
ఈనెల 8వ తేదీన ఎస్సె హరిత ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా లక్ష్మీపురం రోడ్డులో సొసైటీ బిల్డింగ్ వెనక చెరువు కట్ట వద్ద ముగ్గురు అనుమానాస్పదంగా ఉండగా, పోలీసులు సైరన్ విని వారు ద్విచక్ర వాహనాలపై పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.
కల్లూరు మండలానికి చెందిన షేక్ హమీద్, మణుగూరుకు చెందిన షేక్ హబీబ్ పాషా, మీడియం గోవింద్ లు గా గుర్తించారు. వీరు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ప్రతి ప్యాకెట్ ను రూ.200-300కి విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
వీరు మల్కానగిరి జిల్లా, కేందుగూడ గ్రామంలో సన్నీ వద్ద గంజాయి కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో కల్లూరు, మణుగూరులో అమ్ముతున్నారు. ఇటీవల 10 రోజుల క్రితం 4 కిలోల గంజాయి తెచ్చుకుని హమీద్ రెండు కిలోలు, మిగిలిన ఇద్దరు చెరో కిలో చొప్పున తీసుకున్నారు.
హమీద్ వద్ద ఉన్న గంజాయి ని పెనుబల్లి మండలం వి.యం బంజరకు చెందిన గడ్డం ప్రశాంత్,బ్రహ్మతేజ, పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన శివ,రామకృష్ణ,
పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామానికి చెందిన శ్రీకాంత్ హరి, డియో సాయి నివాసం: బిసి కాలనీ, వి.యం బంజర, కల్లూరు పట్టణం గోపాల కుంటకు చెందిన గుండ్ల శివ,బొడ్డు చందు, బేతి నిఖిల్, సోమలింగారెడ్డి హాస్పిటల్ రోడ్డు కు చెందిన ఆసిఫ్, కల్లూరు అంబెడ్కర్ నగర్ కి చెందిన ఉబ్బన సుభాష్, తల్లాడ కి చెందిన కార్తీక్,హరి, తల్లాడ మండలం ఎన్టీఆర్ నగర్ కి చెందిన విష్ణు,అంజనా పురం కి చెందిన రఘు,పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన వంగల మణికంఠ, వెంసూర్ చెందిన చింటూ,గోపి అనే 19 మంది వ్యక్తులు తరచుగా కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం తెలిపారు.
ఈ దాడిలో మొత్తం 822 గ్రాముల గంజాయి (రూ.24,600 విలువ), రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఈ గంజాయి సరఫరాకు మద్దతు ఇచ్చిన వ్యక్తులను కూడా గుర్తించి అరెస్టు చేస్తామని సీఐ ముత్తు లింగయ్య, ఎస్సె హరిత తెలిపారు.
పోలీస్ సిబ్బందిని ఏసీపీ రఘు అభినందించారు. అలాగే నిషేధిత గంజాయి వంటి చెడు వ్యసనాలకు గురి అవుతున్న యువత పై సమాచారం అందించాలని ఏసీపీ విజ్ఞప్తి చేశారు.









