సూర్యాపేట :  గంజాయి పై పోలీసుల విస్తృత దాడులు, అదుపులో ఏడుగురు నిందితులు

సూర్యాపేట :  గంజాయి పై విస్తృత దాడులు, అదుపులో ఏడుగురు నిందితులు

ఎస్ పి రాజేంద్రప్రసాద్

సూర్యాపేట, సెప్టెంబర్24, మనసాక్షి : సూర్యాపేట జిల్లాలో మోతే, హుజూర్నగర్, కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీ లో భాగంగా 300 కేజీల గంజాయి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పోలీస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ పి వివరాలుడించారు.

మోతే పోలీసు స్టేషన్ పరిధిలో 138 కిలోలు గంజాయి , ఒక మారుతి కారు రెండు సెల్ ఫోన్లు 1250 నగదు, హుజూర్నగర్ లో 93.540 కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లు ఒక కారు, కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 37 కేజీల గంజాయి ఒక కారు రెండు మొబైల్స్, మొత్తం 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 7 గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.. అనంతరం తనిఖీల్లో బాగా పనిచేసిన సిబ్బందిని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించారు.