తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : జిల్లాస్థాయి అథ్లెటిక్స్ లో అభ్యాస్ టెక్నో హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ..!

Miryalaguda : జిల్లాస్థాయి అథ్లెటిక్స్ లో అభ్యాస్ టెక్నో హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడలోని అభ్యాస్ టెక్నో హైస్కూల్ విద్యార్థులు సోమవారం నల్గొండలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ చాటినట్లు పాఠశాల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ వంగాల పుష్పలత తెలిపారు. పాఠశాలలో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అండర్ 20 కేటగిరీలో 100 మీటర్ల అథ్లెటిక్స్ లో ఎస్. శిశిందర్ మొదటి స్థానం సాధించగా ట్రైయాతలాన్ పోటీలలో అండర్ 14 విభాగంలో వి. బాలోజీ రెండోస్థానం సాధించి సత్తా చాటినట్లు తెలిపారు.

పాఠశాలలో చదువుతోపాటు పీఈటీలు సతీష్, నవీన్, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో క్రీడలకు సైతం అధిక ప్రాధాన్యమిస్తున్నామని ఈ నేపథ్యంలోనే పలువురు క్రీడాకారులు జిల్లా స్థాయిలో ప్రతిభ చాటినట్లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు త్వరలో వరంగల్ లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. వాట్సాప్ లో ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం..!

  2. Nalgonda : 15 నెలల కొడుకుని బస్టాండ్ లో వదిలేసిన యువతి.. ప్రియుడితో జంప్.. సర్వత్రా చర్చ..!

  3. Sub Collector : కల్లూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది ఎవరో తెలుసా..!

  4. TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!

మరిన్ని వార్తలు