Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

District collector : ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

జగిత్యాల, (మన సాక్షి) :

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డితో కలసి కలెక్టర్ స్వయంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 22 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, ఆర్డీఓ లు మధు సుధన్, శ్రీనివాస్, జివాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంత రావు, వివిధ జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు