Railway : రాత పరీక్ష లేకుండానే రైల్వే జాబ్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు..!
Railway : రాత పరీక్ష లేకుండానే రైల్వే జాబ్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఇదో భారీ గుడ్ న్యూస్. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు రాదేమో అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ సిద్ధం చేసింది.
4096 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. అందుకు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలను ఎంపిక చేస్తారు.
ఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ రైల్వే పరిధిలోని డివిజన్, వర్క్ షాప్ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 4096 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పదవ తరగతి, ఐటిఐ పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎలాంటి రాత పరీక్ష లేకుండానే టెన్త్, ఐటిఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
అందుకు 15 నుంచి 24 ఏళ్ళ వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు చేసే అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపులు మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ 2024 సెప్టెంబర్ 16వ తేదీలో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
LATEST UPDATE :
మిర్యాలగూడ : నాలాలపై అక్రమ నిర్మాణాలు.. వర్షం వస్తే ఇండ్లలోకి చేరుతున్న మురుగునీరు..!
వాగులో కొట్టుకుపోయిన కారు.. కనిపించకుండా పోయిన తండ్రి, కూతురు..!
నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!
Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!









