TOP STORIESBreaking Newsహైదరాబాద్

Railway Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఎంపిక..!

Railway Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఎంపిక..!

మన సాక్షి :

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. నార్త్ రీజియన్ నుండి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. పదవ తరగతి అర్హతతో పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

పదవ తరగతి అర్హతతో 38 పోస్టులతో గ్రూప్ డి లెవెల్ 1 స్థాయి పోస్టులకు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ వెలువడింది. 2025 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. 2025 మార్చి 9వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చును.

18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగి ఉన్న వారై ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 500 రూపాయల ఫీజు ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 40000 ఉంటుంది. దాంతో పాటు ఇతర అన్ని రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.

దీనికి కేవలం పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ కోట సర్టిఫికెట్, కుల, ఆదాయ, స్టడీ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

■ MOST READ : 

  1. Hyderabad : కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. నాచారం వాసులుగా గుర్తింపు..!

  2. Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల.. రెండు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో జమ.. బిగ్ అప్డేట్..!

  3. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాలేదా.. అయితే ఇలా చేయండి..!

  4. Suryapet : ఎండి పోయిన బోరు నుండి ఎగిసిపడుతున్న గంగమ్మ.. (వీడియో)

మరిన్ని వార్తలు