Rajiv Yuva Vikas : రాజీవ్ యువ వికాసం.. ముందుగా వారికి 4 లక్షలు, ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు..!

Rajiv Yuva Vikas : రాజీవ్ యువ వికాసం.. ముందుగా వారికి 4 లక్షలు, ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి నాలుగు లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పించారు.
అయితే నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తే రాయితీని పొందవచ్చును. కొందరికి ఏకంగా 100% రాయితీ ఉంటుంది. నాలుగు లక్షల రూపాయలు తీసుకున్న యువత ఒక రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన పనిలేదు. అయితే ఈ పథకానికి సంబంధించిన కీలక అప్డేట్ ఏంటంటే..
రైలు మార్గం కోసం భూములు కోల్పోయి పరిహారం తీసుకోని వారికి ఈ స్కీమ్ కింద తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బి టి పి ఎస్ రైలు మార్గం నిర్వాసితులకు రాజీవ్ యువ వికాసం పథకం కింద మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఈ మేరకు జిల్లా ఖమ్మం జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి బి టి పి ఎస్ కు బొగ్గు రవాణా కోసం గతంలో రైతుల నుంచి భూములు సేకరించారు. కొంతమంది ఉద్యోగం కల్పించాలని డబ్బులు తీసుకోలేదు. అయితే తక్కువ పొలం తీసుకొని ఉద్యోగాలు కల్పించడం వీలుకాదని, వీరికి అధికారులు స్పష్టం చేశారు.
దాంతో ఆ పనులు పెండింగ్‌లో పడుతూ వస్తున్నాయి. కాగా ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం పథకం కింద వీరికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కీం కింద వారికి 4 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. అలాగే 70% రాయితీ కూడా లభిస్తుంది. అయితే మిగతా 30% మొత్తానికి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అదేంటంటే జెన్కో సంస్థ మిగతా 30% మొత్తాన్ని చెల్లించనున్నది.
ఆ రైతులు మొత్తం నాలుగు లక్షల రూపాయలను కూడా ఈ పథకం ద్వారా ఉచితంగా పొందవచ్చును. అంతేకాకుండా రైలు మార్గంలో నష్టపోయిన భూమికి కూడా పరిహారం వస్తుంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద మరో లక్ష రూపాయలు కూడా వస్తాయి. అయితే ఈ స్కీం కింద 25 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి పేర్కొన్నారు.
MOST READ NEWS :
-
Miryalaguda : వేసవిలో ఉపాధ్యాయులు స్వచ్ఛంద బడిబాట.. అభినందించిన ఎమ్మెల్యే..!
-
PDS : కారులో పీడీఎస్ సన్న బియ్యం అక్రమ రవాణా.. పట్టుకున్న పోలీసులు.. ముగ్గురిపై కేసు..!
-
Loans : కొత్త రకం రుణాలను ప్రవేశపెట్టిన పూనావాలా ఫిన్‌కార్ప్..!
-
District collector : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Crypto Currency : క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి.. డబ్బుకు, క్రిప్టోకు తేడా ఏంటి..!
-
Health : మీ జుట్టు నల్లబడాలా.. చాలా సింపుల్.. ఈ నీళ్లు దివ్యౌషధం..!









