Khammam : ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర..!

Khammam : ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర..!
ఖమ్మం, మనసాక్షి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కై “ఖమ్మం నుంచి హైదరాబాద్ “వరకు దాదాపు రెండు వందల యాభై కిలో మీటర్లు పాదయాత్ర కోసం సిద్ధమయ్యారు.
ఈ నెల “17 వ తారీకు నుంచి పెండింగ్ లో ఉన్న 8,300 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ తో చేసే పాదయాత్ర “లో భాగంగా ఖమ్మం వేదికగా బీజేపీ రాష్ట్ర నాయకులు గోంగూర వెంకటేశ్వర్లు , మోత్కూరు నారాయణ రావు చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.
బీజేపీ నాయకులు గోంగూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో డిగ్రీ ఆ పైస్థాయి ప్రైవేటు కాలేజీలు అన్ని మూతపడి. ఆ కాలేజీల యాజమాన్యాలు సమ్మెబాట పట్టి చాలా రోజులైంది ఆ యాజమాన్యాలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తొమ్మిది వందల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయమనీ అడుగుతున్నారు.
ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలంటున్నారు, ఇంకా రావలసిన బకాయలు గురించి ఆ తర్వాత , రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల భవిష్యత్తు, వారి పరీక్షలు ఇవేవీ వాళ్లకు పట్టడం లేదు ఈ దేశాన్ని నిర్మించే అటువంటి విజ్ఞానాన్ని నేర్పేటువంటి విద్యాసంస్థలు, అక్కడ నేర్చుకునే విద్యార్థులు గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కించిత్ కూడా ఇంట్రెస్ట్, అవసరం లేదు.
కేవలం తమ స్వార్థం కోసం తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే తమకు అవసరమైన వాటిని మాత్రమే పట్టించుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ దాదాపు 40 శాతం ఉన్నటువంటి యువత ఇలాంటి వాటి గురించి తప్పకుండా ఆలోచించాలి అని , చాలా మంది పేద విద్యార్థులు సర్టిఫికేట్ కోసం మొత్తం ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్ లు ఇస్తున్నారుఅని చెప్తున్నారు.
నా పాదయాత్ర చూసి అయిన ప్రభుత్వం నికి సిగ్గు రావాలి పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త , ఖమ్మం బీసీ యువ నాయకులు జక్కుల రాజేష్ పెనుగురి కోటేశ్వర రావు , వినయ్ , డా. అల్తాఫ్, షేక్ ఏడుకొండలు యువత పాల్గొన్నారు.
MOST READ :
-
Nalgonda : జిల్లా ఎస్పీ కీలక సూచన.. ర్యాగింగ్ భూతాన్ని కళాశాల నుండి తరిమివేయాలి..!
-
TG News : మాజీ మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్.. జూబ్లీహిల్స్ ఓటర్ల నిర్ణయం అదే..!
-
Alumni : 13 ఏళ్ల తర్వాత ఘనమైన వసంతోత్సవం.. గురు శిష్యుల బంధం మహోన్నతమైనది..!
-
TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!









