Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుపండుగలుసంగారెడ్డి జిల్లా

భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు..!

ముస్లింల పవిత్రమైన రంజాన్‌ పండుగను సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని కంగ్టి , తడ్కల్, దెగుల్ వాడి శనివారం ఘనంగా తడ్కల్ ఈద్గాలో సామూహిక ప్రార్థనలకు వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు.

భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు..!

  • కంగ్టి మండలంలో ఘనంగా ఈద్ – ఉల్ – ఫీతర్

  • సామూహిక ప్రార్థనల్లో ముస్లింలు

  • అలై బలై తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్న చిన్నారులు

కంగ్టి, మన సాక్షి :

ముస్లింల పవిత్రమైన రంజాన్‌ పండుగను సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని కంగ్టి , తడ్కల్, దెగుల్ వాడి శనివారం ఘనంగా తడ్కల్ ఈద్గాలో సామూహిక ప్రార్థనలకు వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. కుటుంబసభ్యులంతా కొత్త వస్త్రాలు ధరించి భక్తిభావంతో ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా ఇమామ్ నయ్యర్ ఆజం ఖురాన్‌ సూక్తులు చదివి వినిపించారు. ఆనంతరం దేశం,రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్ధనలు చేశారు.

ప్రతి ముస్లిం అల్లాహ్‌ ఆదేశాలను శిరసావహించాలని, తమ తోటివారు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సాయమందించాలన్నారు. ముస్లింలు వృధా ఖర్చులను అరికట్టి ఆపదలో ఉన్నవారికి అందించాలన్నారు. ప్రతి ముస్లిం తమ చుట్పపక్కల ఉన్న పేదవారి పట్ల బాధ్యతతో మెలగాలని, ప్రతి సంవత్సరం క్రమం తప్పక జకాత్‌ ఇచ్చి వారి కష్టాలను దూరం చేయాలని పిలుపునిచ్చారు.

పేద, ధనిక బేధం లేకుండా ముస్తింలంతా ఒకే వరుసలో నిలబడి ప్రార్ధనలు చేసే అవకాశం ఒక్క ఇస్లాం  మతంలోనే ఉందన్నారు. అనంతరం ఈద్గా వద్ద ఇమామ్ నయ్యర్ అజం ఈదుల్‌ ఫితర్‌ ప్రత్యేక ప్రార్ధనలు చేయించారు. అనంతరం ఒకరికొకరు ‘ఈద్‌ ముబారక్‌ చెప్పుకుంటూ ఆలింగనం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షులు డాక్టర్ హమీద్, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఖాదర్, అహ్మద్,డాక్టర్ సత్తార్ సాబ్, భగవాన్ బాబు సాబ్, రహీం టీచర్, శంశోద్దీన్ టీచర్ , షబ్బీర్ సాబ్ , జలిల్ రుస్తుం , ముల్తాని బాబు సాబ్ ,రుస్తుం చాంద్ సాబ్, అలీమ్ సాబ్, భగవాన్ షాదుల్ సాబ్ తడ్కల్ పరిసర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు