రామసముద్రం ఎస్సైగా వెంకటసుబ్బయ్య..!
రామసముద్రం ఎస్సైగా వెంకటసుబ్బయ్య..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రంమండలం నూతన ఎస్సైగా వెంకటసుబ్బయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి 2టౌన్ ఎస్సై గా పని చేసి బదిలీ పై రామసముద్రం వచ్చారు. ఈ సందర్బంగా ఎస్సై వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.
అసాంఘిక కార్యక్రమాలు జూదం, అక్రమమద్యం,ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక ద్రుష్టి సాదిస్తామన్నారు.కర్ణాటక మద్యం అరికట్టడానికి భార్డర్ లో గస్తీనిర్వహిస్తామన్నారు. ఎళ్లవేళలా మీకు అందుకుబాటులో ఉంటానని మీ సమస్యలు నెరవేరుస్తానన్నారు.
ఎక్కడైనా చట్ట వ్యతిరేకపనులు చేపడుతున్నారని తెలిస్తే వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరిడికి ఉందన్నారు. ప్రజలు తిరిగే ప్రదేశాల్లో అల్లరి మూకలవికృత చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ సిబ్బంది ప్రముఖ రాజకీయ నాయకులు ప్రజలు నూతన ఎస్సై వెంకటసుబ్బయ్యకి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే ఇక్కడ నుండి వాయల్పాడుకు బదిలీ పై వెళ్లిన ఎస్సై చంద్రశేఖర్ మాట్లాడుతూ నాకు సహాయ సహకారాలు అందించిన రాజకీయ పార్టీ నాయకులకు ప్రజలకు ముఖ్యంగా పత్రికవిలేకురలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
LATEST UPDATE :
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!









