Apollo: అపోలో ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స..!
Apollo: అపోలో ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స..!
హైదరాబాద్, మన సాక్షి:
అపోలో ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. తెలంగాణలోనే తొలిసారిగా అల్లోగ్రాఫ్ట్ టెండన్ (ఆకిలీస్ టెండన్) ఆధారిత లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ శస్త్రచికిత్స విజయవంతంగా అపోలో వైద్య బృందం నిర్వహించింది. ప్రమాదంలో గాయపడి, తీవ్రమైన భుజం నొప్పితో బల హీనంగా మారిన వ్యక్తి ఎడమ చెయ్యికి అపోలో ఆస్పత్రి వైద్యులు అరుదైన సర్జరీని నిర్వహించారు.
55 ఏళ్ల వ్యక్తి ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత అతనికి భుజం వద్ద తీవ్రమైన నొప్పి రావడంతో పాటు ఎడమ చేయి బలహీనంగా మారింది. దీంతో అతను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులను సంప్ర దించారు. అతడిని పరిశీలించిన షోల్డర్ సర్జన్ డాక్టర్ ప్రశాంత్ మేశ్రం సర్జరీ చేయాలని నిర్ణయం తీసుకు న్నారు.
‘బైసెప్స్ టెండన్ రీ-రూటింగ్, సబ్స్కాపులారిస్ టెండన్’ పద్ధతిలో చికిత్స చేసి భుజం పనితీరును జరిగేటట్లు చూశారు. ఆపరేషన్ తర్వాత భుజం జాయింట్ హెడ్ పొజీషన్ తిరిగి సరిచేసినట్లు డాక్టర్ ప్రశాంత్ మేశ్రం తెలిపారు. అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో తొలిసారిగా జాయింట్ ప్రిజర్వేషన్ కోసం అల్లోగ్రాఫ్ట్ టెండన్నును ఉపయోగించినట్లు ఆయన వివరించారు.
MOST READ :
-
Google Search : గూగుల్లో సెర్చ్ చేశాడు.. స్కామర్లకు చిక్కాడు..!
-
Miryalaguda : ఓపెన్ టెన్త్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష.. పోలీసులకు ఫిర్యాదు..!
-
Hyderabad : హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం..!
-
Rajiv Yuva Vikas : రాజీవ్ యువ వికాసం.. ముందుగా వారికి 4 లక్షలు, ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు..!
-
Rythu Bharosa : రైతు భరోసా అందని రైతులకు స్పష్టత.. లేటెస్ట్ అప్డేట్..!









