Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : ఓపెన్ టెన్త్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష.. పోలీసులకు ఫిర్యాదు..!

Miryalaguda : ఓపెన్ టెన్త్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష.. పోలీసులకు ఫిర్యాదు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరుగుతున్న ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తే గాని అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల ప్రకారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నాలుగు పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సెయింట్ మేరీ పాఠశాల, బకాలవాడ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి.

కాగా బాలికల ఉన్నత పాఠశాలలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసినట్లుగా సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. దాంతో తాసిల్దార్ హరిబాబు, ఎంఈఓ బాలు నాయక్ తనిఖీ నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఓపెన్ టెన్త్ పరీక్షల్లో గువ్వ శ్రీనివాస్ కు బదులు ఏ శ్రీనివాస్ అనే వ్యక్తి పరీక్ష రాస్తుండగా పట్టుబడ్డాడు. దాంతో వెంటనే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరిండెంట్, ఇన్విజిలేటర్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఎంఈఓ తెలిపారు.

MOST READ :

  1. Miryalaguda : ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు.. విచారణ జరపి చర్యలు తీసుకోవాలి..!

  2. Rajiv Yuva Vikas : రాజీవ్ యువ వికాసం.. ముందుగా వారికి 4 లక్షలు, ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు..!

  3. Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్.. ఎస్వి మోడల్ స్కూల్ విద్యార్థి..!

  4. Inter Results : ఇంటర్ లో 440 మార్కులకు 434 ఓ విద్యార్థినికి.. కానీ ఏమైందో చూడండి.. (వీడియో)

మరిన్ని వార్తలు