Suryapet : ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెంట్ అవార్డుకు రవిందర్ ఎంపిక..!

Suryapet : ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెంట్ అవార్డుకు రవిందర్ ఎంపిక..!
సూర్యాపేట, మన సాక్షి:
తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగాపూర్ బీ.ఈడీ. కళాశాలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్. ఎస్. రవీందర్ కి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరము వారు అందించే ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం నేషనల్ ఎక్సలెంట్ అవార్డు. 2025 కి ఎంపిక చేశారు.
ఇటీవలనే డాక్టర్ రవీందర్ కు ఇంటర్నేషనల్ టీచర్ ఎక్సలెంట్ అవార్డు 2025 అందుకున్నారు.త్రేత యుగ్ ఫౌండేషన్,యూపీ, అయోధ్య వారు అందించే ఈ ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు 2025 కి ఎంపిక కావడం , రెండు అవార్డులు ప్రతిష్టాత్మకమైన త్రేతా యుగ్ ఫౌండేషన్ నుండి రావడం ఎంతో అభినందనీయమని వారు తెలియజేశారు.
అంతేకాకుండా సన్ 9ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు కావలసిన విద్యా సమాచారాన్ని, పోటీ పరీక్షల సమాచారాన్ని, టెట్ డీ.ఎస్సీ. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి సైకాలజీ పాఠాలను కూడా తమ ఛానల్ ద్వారా అందిస్తున్నారు.
డాక్టర్ రవీందర్ కి ఈ అవార్డు రావడం పట్ల తమ తల్లిదండ్రులు సిగ లక్ష్మయ్య, మణెమ్మ, సతీమణి స్వరూపారాణి, సోదరి గోపగాని ఉషశ్రీ, బావ, సూర్యాపేట మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ, సూర్యాపేట జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవేందర్ కుమార్, సోదరులు పృథ్వి కుమార్, దుర్గాప్రసాద్, రాజేశ్వరి అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ఎన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షించారు.









