Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఉద్యోగంజాతీయం

SBI JOBS : ఎస్బిఐ లో భారీ ఉద్యోగాల జాతర.. 3500 పోస్టుల భర్తీకి సన్నాహాలు..!

SBI JOBS : ఎస్బిఐ లో భారీ ఉద్యోగాల జాతర.. 3500 పోస్టుల భర్తీకి సన్నాహాలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దేశీయంగా అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను భారీగా ఉద్యోగాల నియామకాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. రాబోయే ఐదు నెలల కాలంలో 3500 ప్రొబేషనరీ ఆఫీసర్ (పిఓ) పోస్టులను భర్తీ చేనున్నట్లు ప్రకటించింది.

నియామక ప్రక్రియ పై ఎస్బిఐ డిప్యూటీ ఎండి (హెచ్ ఆర్) కిషోర్ కుమార్ పోలుదాసు వివరాలను వెల్లడించారు. ఎంపిక ప్రక్రియకు మూడు దశల్లో పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది జూన్ నాటికే 505 పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవసరాల మేరకు ఆఫీసర్లు, క్లరికల్ క్యాడర్లో మొత్తం కలిపి 18,000 పోస్టులను భర్తీ చేనున్నట్లు ఎస్బిఐ చైర్మన్ చల్లా శ్రీనివాస్ శెట్టి తెలియజేసిన విషయం తెలిసిందే.

అందులో భాగంగానే పిఓ పోస్టుల నియామకాలు జరగనున్నాయి. ఐటి, సైబర్ సెక్యూరిటీ విభాగాలను బలోపేతం చేయడంపై ఎస్బిఐ దృష్టి సారించింది. అందులో భాగంగానే 1300 మంది నిపుణులను నియమించుకుంది. దాంతో బ్యాంకు సేవలు వినియోగదారులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఎస్బిఐ ఉంది.

MOST READ : 

  1. Nalgonda : జలదిగ్బంధంలో కొమ్మేపల్లి గురుకుల పాఠశాల.. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలు..!

  2. Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!

  3. Cyber crime : టీవీ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే రూ.99 వేలు కొట్టేశారు..!

  4. State Level : రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి..!

  5. Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!

మరిన్ని వార్తలు