Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

RDO : ఆర్డిఓ కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ..! 

RDO : ఆర్డిఓ కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ..! 

గుర్రంపోడు, మన సాక్షి :

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను దేవరకొండ రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ రమణా రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పాట్లను, జరుగుతున్న ప్రక్రియను పర్యవేక్షించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.తాలు, తేమ లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.ధాన్యం తూకం వేసిన తర్వాత, సంచుల రవాణా కోసం తగినన్ని వాహనాలను సిద్ధంగా ఉంచాలని రవాణా కాంట్రాక్టర్లకు సూచించారు.

ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు కప్పడం, కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించడం, నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయడం, ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేయడం వంటి విషయాలను, తేమ శాతం, నాణ్యత విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టం చేశారు.

కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడితే లేదా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ కూడా అధికారులను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర పొందాలని కోరారు.

రైతులు కూడా సహకరించాలని, నాణ్యమైన, ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే తీసుకురావాలని కోరారు. 17 శాతం తేమకు మించకుండా చూసుకోవాలని పలు సూచన చేశారు. ఈయన వెంట ఎమ్మార్వో శ్రీనివాసు, ఏవో మాధవరెడ్డి తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Fee : పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూళ్లు.. డీఈఓ ఆదేశాలు బేఖాతర్..!

  2. Alumni : 13 ఏళ్ల తర్వాత ఘనమైన వసంతోత్సవం.. గురు శిష్యుల బంధం మహోన్నతమైనది..!

  3. TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!

  4. TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!

మరిన్ని వార్తలు