TOP STORIESBreaking Newsవ్యవసాయంహైదరాబాద్

Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్

Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. జనవరి 26వ తేదీన ఒకేసారి నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించి రికార్డు నెలకొల్పింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ నాలుగు పథకాలను రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాలలో ఒకేసారి ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే కేవలం ఆయా గ్రామాలలోని ఈ పథకాలను ప్రారంభించారు. మిగతా గ్రామాలకు రాలేదంటూ రైతుల నుంచి ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దాంతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పష్టంగా ప్రకటించారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31వ తేదీ వరకు పూర్తిస్థాయిలో ఈ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా రైతులకు పంట సహాయం అందజేయడానికి గాను రైతు భరోసా పథకాన్ని మార్చి 31వ తేదీలోగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నారు. ఎకరానికి 12 వేల రూపాయలను ప్రకటించగా తొలివిడతగా 6000 రూపాయల పంట పెట్టుబడి సహాయాన్ని రైతులకు నేరుగా వారి వారి ఖాతాలలో జమ చేయనున్నారు.

రైతు భరోసా పథకాన్ని రైతులందరికీ అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రైతుల ఖాతాలలో రైతు భరోసా సహాయాన్ని జమ చేయనున్నారు. రోజు విడిచి రోజు రైతుల ఖాతాలలో మార్చి 31వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు.

MOST READ : 

  1. TG News : కుల గణన సర్వే రిపోర్ట్.. బీసీ జనాభా లెక్క తేలింది.. అధికారికంగా ప్రకటించిన కమిటీ..!

  2. Good News : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.5లక్షలు పొందే పథకం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

  3. TG News : కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ పై అప్డేట్.. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

  4. TG News : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిజమేనా.. సీఎంకు ఆ ఎమ్మెల్యే లేఖ..!

  5. ఆ గ్రామంలో సంపూర్ణ మధ్య నిషేధం.. అమ్మితే రూ. 50 వేలు జరిమానా.. ఏకగ్రీవ నిర్ణయం..!

మరిన్ని వార్తలు