Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Musi : మూసి ప్రాజెక్టు కుడికాలువకు నీటి విడుదల..!

Musi : మూసి ప్రాజెక్టు కుడికాలువకు నీటి విడుదల..!

కేతేపల్లి, మనసాక్షి :

మూసి ప్రాజెక్టు ఆయకట్టులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కేతేపల్లి మండలంలోని మూసి రిజర్వాయర్ కుడి కాలువ కు శుక్రవారం గేట్లు ఎత్తి సాగుకై నీటిని కిందికి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాట్లు వేసుకునేటప్పుడే సాగునీరు విడుదల చేయాలనె ఉద్దేశ్యంతో నీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు. కుడి కాలువ చివరి ఆయకట్టు వరకు నీరు అందెలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

నకిరేకల్, కేతేపల్లి మండలాల్లోని మరికొన్ని గ్రామాలకు మూసి నీరు అందెలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు. వానాకాలం, వేసంగి కాలాలలో మూసి ప్రాజెక్టు ద్వారా 60 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని, రిజర్వాయర్ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని ఆయన అన్నారు.

నీటిపారుదల విషయంలో రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి, నకిరేకల్ మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, తాటికల్ పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, తహసిల్దార్ రమాదేవి, మూసి ప్రాజెక్ట్ ఈ ఈ. వెంకటరమణ, డి ఈ చంద్రశేఖర్, ప్రాజెక్టు ఏఈలు, సిబ్బంది, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!

  2. District collector : అక్రమ కట్టడాలపై జిల్లా కలెక్టర్ సీరియస్.. నోటీసులు జారీ చేయాలని ఆదేశం..!

  3. District collector : అస్వస్థతకు గురైన గురుకుల విద్యార్థినులు.. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్..!

  4. District Collector : విద్యార్థుల ఇంటికి వెళ్లిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలుసా..!

మరిన్ని వార్తలు