ప్రతిభకు దక్కిన గౌరవం.. రాష్ట్ర స్థాయి ప్రథమ అవార్డు సొంతం..!
ప్రతిభకు దక్కిన గౌరవం.. రాష్ట్ర స్థాయి ప్రథమ అవార్డు సొంతం..!
సూర్యాపేట, మన సాక్షి :
ప్రపంచ పోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమాచారశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నమస్తే తెలంగాణ సూర్యాపేట జిల్లా స్టాఫ్ ఫోటో గ్రాఫర్ పి.సైదిరెడ్డి రాష్ట్ర స్థాయిలో ప్రథమ అవార్డుకు ఎంపికయ్యారు.
రాష్ట్ర స్తాయి పోటోగ్రఫీ పోటీల్లో మొదటి కేటగిరిలో ‘మహాలక్ష్మి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం” అనే అంశంపై రాష్ట్ర స్థాయి ప్రథమ అవార్డు వరించింది. ఈ నెల 19న హైద్రాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించే కార్యక్రమంలో సైదిరెడ్డి రాష్ట్రస్థాయి అవార్డుతో పాటు – నగదును అందుకోనున్నారు.
ఈ సందర్భంగా అవార్డు విజేత సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఫోటోగ్రఫి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా కేటగిరీలకు ఫోటోలు పంపించడం జరిగిందని మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అనే అంశంపై ఫోటో రాష్ట్ర స్థాయి ప్రథమ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ప్రతి సంవత్సరం ఏదో ఒక కేటగిరీలో అవార్డులు వస్తున్నప్పటికి ఈ యేడాది రాష్ట్ర స్థాయి ప్రధమ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఫోటో జర్నలిస్టు సైదిరెడ్డికి రాష్ట్ర స్థాయి అవార్డు రావడం పట్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రజా ప్రతినీధులు, అదికారులు, నాయకులు, జర్బలిసులు, బందు మిత్రులు అబినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Runamafi : రుణమాఫీ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు ఇవీ..!
Suryapet : సూర్యాపేట జిల్లా లో తీవ్ర విషాదం.. దండు మైసమ్మ ఆలయం వద్ద ఆరేళ్ల బాలుడు మృతి..!
BREAKING : కోదాడ ఖమ్మం జాతీయ రహదారిపై ప్రమాదం.. ప్రమాదంలో రెండు కార్లు ఢీకొని..!
Viral video : లంచం డబ్బులు పంచుకున్న ట్రాఫిక్ పోలీసులు.. సిసి టీవీ రికార్డు వైరల్..!









