Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!
Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!
మన సాక్షి :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద రెండు దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40,000 కుట్టు మిషన్ల పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు. కాగా ఆయన వనపర్తి జిల్లాకు వెళ్లి బాల్యస్మృతులను నెమరు వేసుకున్నారు.
తాను వనపర్తిలో చదువుకున్న సమయంలో ఓ అద్దె ఇంట్లో 12 సంవత్సరాలు ఉన్నారు. అద్దె ఇంట్లో ఉన్న సమయంలో వారితో ఎలాంటి బంధుత్వం, రక్త సంబంధం లేకపోయినా అంతకుమించి ఆత్మీయ బంధాన్ని కలిగి ఉన్నారు.
దాంతో వనపర్తి జిల్లా కేంద్రానికి వెళ్లిన అతను తాను ఉన్న అద్దె ఇంటిని సందర్శించేందుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆ ఇంటి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉబ్బితబిబ్బయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వారి ఇంటికి వెళ్ళగానే హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. సుమారు 20 నిమిషాల పాటు వారితో గడిపారు.
కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. తాను నివసించిన పాత ఇంటిని, కుటుంబ సభ్యులను కలిసిన రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన బాల్యస్మృతులను పంచుకున్నారు.
ఈ ఇల్లు తన జీవితంలో ఒక అధ్యాయంగా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. తన రాజకీయ ప్రయాణానికి ముందు ఈ ఇంట్లోనే ఉన్నట్లు చెప్పారు.
MOST READ :
-
TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!










