Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Revanth Reddy : సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం.. మారిన ముహూర్తం..!

Revanth Reddy : సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం.. మారిన ముహూర్తం..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎల్పీ లీడర్ రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ప్రమాణ స్వీకారానికి స్వల్ప మార్పులు చేశారు. ఉదయం 10 : 28 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగా నిర్ణయించారు. కానీ ముహూర్తం మారింది. మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకార వేేళని మార్చారు.

ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి స్వయంగా ఖర్గే ని కలిసి ఆహ్వానించారు.

ALSO READ : Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!

ఆయనతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ , కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ , తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే తోపాటు పలువురు ముఖ్య నేతలను కూడా ఆహ్వానించారు. కాగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్ బి స్టేడియంలో ఏర్పాటు జరుగుతున్నా యి.

ALSO READ : రేవంత్ రెడ్డిది ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.. ఆయన రాజకీయం టిఆర్ఎస్ తోనే ప్రారంభం.. సోషల్ మీడియాలో వైరల్..!

మరిన్ని వార్తలు