Breaking Newsతెలంగాణపండుగలుహైదరాబాద్
Revanth Reddy : మనవడితో హోళీ సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి..!
Revanth Reddy : మనవడితో హోళీ సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి..!
మన సాక్షి , డెస్క్ :
హోళీ సంబరాల వేడుకలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హోళీ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన మనవడితో కలిసి హోళీ సంబరాలు జరుపుకున్నారు.
రేవంత్ రెడ్డి తన మనవడు మనవడితో జరుపుకున్న సంబరాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పరిపాలన, విజ్ఞప్తులు, పరిష్కారాలు, సమావేశాలు, రాజకీయాలు అన్నింటికీ కొంత విరామం అంటూ సోషల్ మీడియాలో మనవడితో జరుపుకున్న హోళీ ఫోటోలు రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.










