Cm Revanth : నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. 35వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..!
Cm Revanth : నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. 35వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలియజేశారు. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మరో 35 వేల ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
బుధవారం విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్య శిక్షణకు గాను నూతనంగా ఈ ఎఫ్ ఎస్ ఐ కోర్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగ తీవ్రతను తమ ప్రభుత్వం గుర్తించింది అన్నారు.
50 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు కల్పించినప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య తీరేది కాదని ఆయన పేర్కొన్నారు. యువత సాంకేతిక నైపుణ్యం వైపు దృష్టి మరల్చి సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ పొందితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.
పరిశ్రమలకు నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉందని, సాంకేతిక నైపుణ్యం మెరుగుపరుచుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను ఇప్పటికే 35 వేలు భర్తీ చేశామని, మరో 35 వేల ఖాళీలను వివిధ శాఖలలో గుర్తించినట్లు తెలిపారు. త్వరలో 35వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు తెలిపారు.
LATEST UPDATE :
-
Cm Revanth Reddy : విద్యార్థులకు గుడ్ న్యూస్.. జాబ్ గ్యారంటీ కోర్సు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!
-
RunaMafi : రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. వారికి మాత్రమే 4వ విడత మాఫీకి కసరత్తు..!
-
NALGONDA : నల్గొండ జిల్లాలో ఎంపీడీవో, ఇద్దరు కార్యదర్శుల సస్పెన్షన్..!
-
Job Mela : ఈనెల 28న జాబ్ మేళా.. వేతనం నెలకు రూ.17 వేలు..!









