కేటీఆర్ కు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.. కేటీఆర్ స్పందన ఏంటి..!
కేటీఆర్ కు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.. కేటీఆర్ స్పందన ఏంటి..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప్పు నిప్పు లాంటివారు. రాజకీయాల్లో ప్రత్యర్ధులు. ఎన్నికల సమయంలో వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకున్న వారే. అయినా కూడా కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకో తెలుసుకుందాం..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. నిత్యం ప్రజా సేవలో నిమగ్నం అవుతూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేయడంతో కేటీఆర్ స్పందిస్తూ మెనీ థాంక్స్ రేవంత్ రెడ్డి గారు అని ఆయన కూడా ట్విట్టర్ లో రీ ట్వీట్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- Srishailam : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..!
- సాగర్ లో గుప్త నిధుల త్రవ్వకాల కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు
- BUDGET 2024: మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం, వ్యవసాయం, గృహ నిర్మాణ రంగాలకు కేటాయింపులు, ఉద్యోగాలకు భారీ ప్రోత్సాహం.. బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు
Many Thanks Revanth Reddy Garu 🙏
Appreciate the greetings https://t.co/7DYXe1I9vW
— KTR (@KTRBRS) July 24, 2024









