తెలంగాణలో రేవంత్ వర్సెస్ హరీష్ రావు, హాట్ టాపిక్ గా రాజకీయ సన్యాసం, రాజీనామా..!
తెలంగాణలో రేవంత్ వర్సెస్ హరీష్ రావు, హాట్ టాపిక్ గా రాజకీయ సన్యాసం, రాజీనామా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు సాగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సన్యాసం, రాజీనామా అనే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి హరీష్ రావు మధ్య ఓ ప్రచన్న యుద్ధమే సాగుతోందని చెప్పవచ్చును. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మద్య విమర్శలు నిత్యం సాగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 100 రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి , బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీని నెరవేరిస్తే తాను రాజీనామా చేస్తానని హరీష్ రావు ప్రకటించారు. కాగా ఆగస్టు 15 గడువు రాకముందే రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంతా హరీష్ రావు సవాల్ చేసిన విధంగా రాజీనామా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు.
కాగా ట్విట్టర్ వేదికగా మరోసారి సవాల్ చేశారు. రుణమాఫీ తో పాటు ఆరు గ్యారెంటీ హామీలలో మొత్తం ఆగస్టు 15వ తేదీ లోగా అమలు చేస్తే రాజీనామా చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదని ఆగస్టు 15వ తేదీ లోగా ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా గత ఎన్నికల్లో కొడంగల్ లో ఓటమిపాలైతే రాజకీయ సన్యాసం చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు విమర్శించారు. కాగా రేవంత్ రెడ్డి సవాల్ చేసి జారుకున్న వ్యక్తి అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుండగా హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దాంతో రాజకీయ సన్యాసం, రాజీనామా అనే అంశాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
ఇవి కూడా చదవండి :
Runamafi : నేడు రైతు ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము.. ఊరూరా సంబరాలకు ఏర్పాట్లు..!
తెరుచుకున్న ఆల్మట్టి గేట్లు, భారీగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. ఆయకట్టు రైతుల ఆశలు పదిలం..!









