Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

BREAKING : కోదాడలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ యువకులు మృతి..!

BREAKING : కోదాడలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ యువకులు మృతి..!

మన సాక్షి , కోదాడ :

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని చిలుకూరు మండలం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ డివిజన్ కు చెందిన యువకులు ముగ్గురు మృతి చెందారు.

వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని త్రిపురారం మండలం గుంటిపల్లి అన్నారం గ్రామానికి చెందిన మలికంటి దినేష్ (22) కొత్త కారు కొనేందుకు తన స్నేహితులైన వేములపల్లి మండలం మొలక పట్నం గ్రామానికి చెందిన వల్లపు దాసు వంశీ (22) మాడుగుల పల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన అభిరాల శ్రీకాంత్ (21) తో కలిసి సూర్యాపేట జిల్లా కోదాడ వెళ్లారు.

అక్కడ షోరూమ్ లో కొంత డబ్బు చెల్లించి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. చిలుకూరు మండలంలోని మిట్స్ కళాశాల వద్ద లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. దాంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

LATEST UPDATE :

మరిన్ని వార్తలు