Accident : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి..!

Accident : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి..!
చింతపల్లి మన సాక్షి :
హైదరాబాద్,- నాగార్జునసాగర్ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చింతపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం రాజ్యా నాయక్ తండ సమీపంలో, రహదారి వెంట గుర్తు తెలియని వ్యక్తి నడుచుకుంటూ వెళుతుండగా అదే సమయంలో గుర్తు తెలియని వాహనం ఆ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది.
దీంతో తీవ్రంగా గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తికి సుమారు 40 నుండి 45 సంవత్సరాలు వయసు కలిగి, చమ న చ్చాయా రంగు, తెల్లటి గుబురు గడ్డం,నల్లటి జుట్టు కలిగి ఉన్నాడు. తెలుపు రంగు షర్ట్ ధరించి లోపల బ్లూ రంగు టీ షర్టు, బ్లూ రంగు ఫార్మల్ పాయింట్ ధరించాడు. 5 అడుగులు ఉన్నాడు.
ఎవరికైనా ఈ వ్యక్తి యొక్క సమాచారం తెలిసినట్లయితే చింతపల్లి పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ఎస్సై ముత్యాల రామ్మూర్తి పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ నెంబర్ 8712670230, 8712675858, కి పూర్తి వివరాలు అందించాలని వారు పేర్కొన్నారు.
MOST READ :
-
Mahabubabad : దారుణం.. బతికుండగానే మార్చురీలో పెట్టి తాళం వేశారు..!
-
New Aadhaar Rules : ఆధార్ రూల్స్ లో భారీ మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..!
-
New Aadhaar Rules : ఆధార్ రూల్స్ లో భారీ మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..!
-
Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!









