TOP STORIESBreaking Newsfoodహైదరాబాద్

Tea : రోడ్ సైడ్ టీ భలే టేస్ట్ గా ఉందా.. అయితే ఈ సీక్రెట్ తెలిస్తే మళ్లీ ఎప్పుడు తాగరు..!

Tea : రోడ్ సైడ్ టీ భలే టేస్ట్ గా ఉందా.. అయితే ఈ సీక్రెట్ తెలిస్తే మళ్లీ ఎప్పుడు తాగరు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

చాలా మంది బయట రోడ్ సైడ్ టీ తాగటం అలవాటు చేసుకుంటారు. స్నేహితులు కలిసినప్పుడు ఇంకా ఏదైనా సమయం గడపాలనుకున్నప్పుడు టీ స్టాల్ కి వెళ్లి టీ తాగడం అలవాటుగా మారింది. అలాంటి వారు ప్రతి రోజుకు నాలుగైదు పర్యాయాలు టీ తాగుతూ గడుపుతుంటారు.

అయితే రోడ్ సైడ్ టి వారికి చాలా టేస్ట్ గా ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో..? ఎలా ఉంటుందో..? తెలుసుకుందాం.. ఆ విషయం తెలుసుకుంటే మీరు మళ్ళీ జన్మలో కూడా రోడ్ సైడ్ టీ తాగారు.

అది ఏంటంటే హైదరాబాదులో ఇటీవల ఆహార తనిఖీ అధికారులు గుట్టలు గుట్టలుగా కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్, చందానగర్, ఫతేనగర్, తదితర ప్రాంతాల్లో నకిలీ టీ పొడి పట్టుకొని నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాలలో పరీక్షలకు పంపారు.

వాటిలో హానికర సింథటిక్ రంగుల వాడినట్లుగా వెళ్లడైంది. టీ పొడి తో పాటు ఎండు కివి పండు ముక్కలు, బెల్లం లోను హానికర రంగులు కలిపినట్లుగా పరీక్షల్లో తేలింది. 2024 డిసెంబర్ లో చందానగర్ లో ఓ ఇంట్లో 150 కేజీల నకిలీ టీ పౌడర్ ను ఆహార కల్తీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

చందానగర్ లో ఇటీవల అధికారులు పట్టుకున్న నకిలీ టీ పొడి

అదేవిధంగా ఎల్బీనగర్ లో ఈ ఏడాది మార్చిలో తనిఖీలు చేపట్టగా నకిలీ టీ పొడి పెద్ద ఎత్తున పట్టుకున్నారు. దీనిని తయారు చేసేందుకు సింథటిక్ రంగులను ఉపయోగిస్తున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. దీనివల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులకు, దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు పేర్కొంటున్నారు.

కేవలం టీ పొడి రంగు తో పాటు ఇలాచి వాసన వచ్చే ద్రవం కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ టీ పొడి వల్ల టీ రుచికరంగా ఉండడంతో చాలామంది రోడ్ సైడ్ టీ తాగడం అలవాటు పడతారు. ఇకపై ఇలాంటి రోడ్ సైడ్ టీలు తాగే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

MOST READ NEWS : 

  1. Health : ఎండు చేపలా, పచ్చివా.. ఆరోగ్యానికి ఏవి మంచివి, గుండె జబ్బు వారికి..!

  2. Health: లంచ్ సమయంలో ఈ ఆహారం తిన్నారో.. అంతే సంగతులు..!

  3. Health : మెదడు చురుగ్గా ఉండాలా.. అయితే ఇలా చేయండి..!

  4. Headache: టీ, కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుందా.. నిజమిదే..!

  5. Health : ఆరోగ్యంగా ఉండాలంటే 5 ఇంట్లో తయారుచేసిన పానీయాలు.. గుండె, మూత్రపిండాలు భద్రం..!

మరిన్ని వార్తలు