Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంవ్యవసాయం

Runamafi : రుణమాఫీ కోసం అధికార పార్టీ ఎమ్మెల్సీ కమిషనర్, కలెక్టర్ కు వినతి..!

Runamafi : రుణమాఫీ కోసం అధికార పార్టీ ఎమ్మెల్సీ కమిషనర్, కలెక్టర్ కు వినతి..!

జగిత్యాల, (మన సాక్షి)

రుణమాపీ జరుగని రైతులకు రుణమాఫీ అయ్యేలా చర్యల చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం లేఖ రాశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను రుణ విముక్తులను చేయాలనే సంకల్పంతో రెండు లక్షల వరకు పంట రుణమాఫీ చేసినప్పటికి క్షేత్రస్థాయిలో అర్హులైన రైతులకు సైతం రుణమాఫీ కావడం లేదని రైతులు ఆందోళన చెందిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని, అర్హులైనప్పటికి రుణమాఫీ జరుగని రైతుల కోసం ప్రత్యేకంగా జాబితా రూపొందించి, ఆయా బ్యాంకుల పరిధిలోని రైతులకు రుణమాఫీ చేసే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందేనని అన్నారు.

రాయికల్ మండలం మైతాపూర్, కోరుట్ల కోరుట్ల మండలం పైడిమడుగు, మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలోని కెనరా బ్యాంకులో పంట రుణాలు పొందిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జరగలేదని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.

ప్రతి సంవత్సరం పంట రుణాలు రెన్యూవల్ చేసుకుంటున్నప్పటికి పంట రుణాలు మాపీ కాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో వివరించారు.

బ్యాంకు అధికారుల తప్పిదంతో అర్హులైన రైతులు పంట రుణాలు మాఫీ పొందలేకపోయారని, పంట రుణమాఫీ పోర్టల్లో పరిశీలించగా, అర్హులైన రైతుల జాబితాను బ్యాంకు అధికారులు పంపలేదని తెలిసిందన్నారు.

మొగిలిపేటలోని కెనరా బ్యాంకు పరిధిలోని రైతులు పంట రుణాలకు అర్హులని బ్యాంకు మేనేజర్ సైతం ధృవీకరించిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ, విచారణ చేపట్టి, అర్హులైన రైతులకు పంట రుణాలు మాఫీ జరిగే విధంగా తగు ఆదేశాలు జారీ చేయడంతోపాటు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్ కు లేఖలో సూచించారు.

అంతేకాకుండా ఎమ్మెల్సీ సంబంధిత లేఖ కాపీని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కూడా అందజేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు